Take a fresh look at your lifestyle.

మరో రెండు దశల్లో కొరోనా..!ప్రమాదం పొంచి ఉంది…

‘‌కొరోనాతో కాపురం తప్పదని తేలిపోయింది.. ఇక దానిని  ఎదుర్కోవాలి అంటే కొరోనాతో కలిసి జీవించటమే అని నిపుణులు తేల్చి చెప్పారు’.. వివరాల్లోకి పొతే..

కానీ ఆరోగ్యకరమైన, సురక్షితమైన కొత్త ప్రపంచం ఆశిద్దాం  : ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ దేశాలు కోవిడ్‌ -19 ‌రెండవ లేదా మూడవ దఫా తీవ్రత ఎదుర్కోవటానికి సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‌యూరప్‌ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌హన్స్ ‌హెన్రీ పి. క్లుగే హెచ్చరించారు.కొరోనా వైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌సిద్ధం చేసే వరకు ప్రపంచదేశాలు వైరస్‌ ‌గుప్పిట వుంటాయని డాక్టర్‌ ‌హన్స్ ‌హెన్రీ పి. క్లుగే వివరించారు.మొదటి కొరోనా తీవ్రత సమిసి పోయింది అని భావించి నట్లయితే… అప్పుడు మనకి రెండవ లేదా మూడవ కొరోనా తీవ్రత కోసం సిద్ధ పడటానికి కొంత సమయం దొరికిందని మాత్రమే అర్ధం అని డాక్టర్‌ ‌హన్స్ ‌హెన్రీ పి. క్లుగే వివరించారు. ‘‘వాక్సిన్‌ ‌లేని దరిమిలా మొదటి తీవ్రత తర్వాత ప్రపంచ దేశాలు భవిష్యత్తులోకొరోనా వైరస్‌ ‌వ్యాప్తి జరగకుండా చూడటం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు. వర్చువల్‌ ‌మీడియా బ్రీఫింగ్‌ ‌ద్వారా పలు విషయాలు డాక్టర్‌ ‌హన్స్ ‌హెన్రీ పి. క్లుగే తెలిపారు. ‘‘కోవిడ్‌ -19 ఇప్పుడప్పుడే మనల్ని విడిచి పెట్టదు’’ అని డాక్టర్‌ ‌క్లూగే హెచ్చరించారు. ‘‘సమాజంలో మరింతగా ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యత నివ్వవలసిన అవసరం ఉంది’’ అని క్లుగే తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ ‌యూరప్‌ ‌డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌హన్స్ ‌హెన్రీ పి. క్లుగే ఇలా చెబుతున్నప్పుడే మరో డైరెక్టర్‌ ‌జనరల్‌, ‌డాక్టర్‌ ‌టెడ్రోస్‌ ఎ. ‌ఘెబ్రేయేసస్‌, ‌కోవిడ్‌ -19 ‌పై డబ్ల్యూహెచ్‌ఓ అధికారిక వర్చువల్‌ ‌విలేకరుల సమావేశంలో ఇలా అన్నారు, ‘‘ప్రజల జీవనోపాధి ప్రమాదంలో ఉన్నందున ప్రజలు తమ దైనందిన జీవనాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుకుంటారు అలాగే డబ్ల్యూహెచ్‌ఓ ‌కూడా సామాన్య జన జీవనం కోరుకుంటున్నది. దీని కోసం డబ్ల్యూహెచ్‌ఓ ‌నిరంతరం పనిచేస్తున్నది. ఐతే మేము చెప్పేది ఏమంటే ప్రపంచం చాలా విషయాలలో మార్పులు చూస్తుంది. మునుపు పయనించిన మార్గంలో ప్రపంచం పయనించే అవకాశం లేదు. ఐతే కొత్త ప్రపంచం ఆరోగ్యకరమైన, సురక్షితమైన మంచి ప్రపంచంగా ఉండాలి అని ఆశిస్తున్నా’’ కొన్ని దేశాలలో కేసుల సంఖ్యలో పెరుగుదలలను చూస్తున్నప్పుడు, ప్రపంచం కొరోనాతో కలిసి బతకడానికి సిద్ధం కావాలి అని తెలిసింది. ఎందుకంటే వైరస్‌ ‌చాలా కాలం పాటు మనతో ఉంటుంది అనేది స్పష్టం.. ఇలా చెప్పింది మరెవరో కాదు అక్షరాలా డబ్ల్యూహెచ్‌ఓ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌. ఇం‌టికి ఆర్డర్లు.. ఇతర భౌతిక దూర చర్యలు చాలా దేశాలలో వైరస్‌ ‌వ్యాప్తిని విజయవంతంగా అణిచివేసాయి.అయినా కానీ ఈ వైరస్‌ ‌చాలా ప్రమాదకరంగా ఉంది … ప్రపంచ జనాభాలో ఎక్కువ భాగం ప్రజలకి సోకె అవకాశం వుంది. వైరస్లు, అంటువ్యాధులు. సులభంగా పునరుద్ఘాటించగలవు. ఇంటి పట్టునే ఉండటం అలవాటు చేసుకోవడం కష్టమని తెలుసు, అయినా కొత్త సాధారణానికి అలవాటు పడటం అవసరం అని డబ్ల్యూహెచ్‌ఓ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌, ‌డాక్టర్‌ ‌టెడ్రోస్‌ ఎ. ‌ఘెబ్రేయేసస్‌ ‌చెప్పారు.

ఇది ఇలా ఉండగా బ్లూమ్‌బెర్గ్ ‌కథనం ప్రకారం, మిన్నెసోటా విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ‌ఫర్‌ ఇన్ఫెక్షియస్‌ ‌డిసీజ్‌ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌పాలసీ నిపుణుల బృందం పరిశోధన అనతరం తయారు చేసిన నివేదిక ప్రకారం, కొరోనావైరస్‌ ‌మహమ్మారి రెండు సంవత్సరాల వరకు భూమి మీద కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకుంటేనే వైరస్‌ నియంత్రించబడుతుందని తెలిపింది. అనారోగ్యంగా కనిపించని వ్యక్తుల నుండి కూడా వైరస్‌ ‌వ్యాప్తి చెందడం వల్ల మహమ్మారి సంభవిస్తున్నది అని నివేదిక వివరిస్తున్నది. అందుకే కొరోనాను నియంత్రించడం కష్టమవుతుంది. వ్యక్తిలో కొరోనా లక్షణాలు కనిపించే ముందే సదరు వ్యక్తి వాస్తవానికి వైరస్‌ ‌బారిన పది ఉండవచ్చు అని నివేదిక చెబుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను లాక్‌ ‌చేసిన తరువాత, ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాపారాలు బహిరంగ ప్రదేశాలను తిరిగి తెరవడానికి నెమ్మదిగా జాగ్రత్తలు పాటిస్తూ అనుమతిస్తున్నాయి. అయితే కొరోనా వైరస్‌ ‌మహమ్మారి 2022 వరకు వేవ్స్ ‌రూపంలో కొనసాగే అవకాశం ఉంది అని నివేదిక చెబుతున్నది. గయానాలో, అవసరమైన వ్యాపారాలు మాత్రమే చేసుకోవటానికి అనుమతించబడతాయి. అయితే, జార్జ్‌టౌన్‌ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ (‌జిసిసిఐ) నాన్‌ ఎస్సెన్షియల్‌ ‌వ్యాపారాలను దశలవారీగా తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరాలని యోచిస్తోంది. ఈ మహమ్మారి ఇంత త్వరగా ముగియదు అనే భావనను ప్రజలలో పొందుపరచాలని నివేదిక ప్రభుత్వ అధికారులను కోరుతోంది. రాబోయే రెండేళ్ళలో ప్రజలు వ్యాధి దశలు దశలుగా వస్తుందని అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి అని నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే వాక్సిన్‌ ‌తయారు చేయటానికి డెవలపర్లు హడావిడి చేస్తున్నారని అయితే ఇది తక్కువ పరిమాణంలో ఉంటుందని నివేదిక తెలిపింది.

Leave a Reply