Take a fresh look at your lifestyle.

అధికార పార్టీలో కొరోనా కలకలం

  • నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణెష్‌కు పాజిటివ్‌
  • ఆం‌దోళనలో పార్టీ కార్యకర్తలు

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కరోనా వెంటాడుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బిగాల గణెష్‌ ‌గుప్తకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన.. హైద రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కరోనా టెస్ట్ ‌చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. ప్రస్తుతం ఆ ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు.

కాగా, ఆదివారం నిజామాబాద్‌ ‌రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కి కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. అయితే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వారిని కలిసిన అధికారులు, పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. కాగా, ఎమ్మెల్యే బిగాల కూడా ముత్తిరెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. ఆయన నుంచే బిగాలకు కరోనా సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం ఆ హాస్పిటల్‌ ‌లోనే ఆయన ట్రీట్‌ ‌మెంట్‌ ‌తీసుకుంటున్నట్లు సమాచారం.

Leave a Reply