Take a fresh look at your lifestyle.

పోలీస్‌ ‌శాఖలో 500 మందికి కొరోనా

ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్‌ను కలవర పెడుతున్న మహమ్మారి

యాదాద్రి స్టేషన్‌లోనూ 12 మందికి పాజిటివ్‌

‌డిగ్రీ పరీక్షలు..ఓపెన్‌ ‌యూనివర్సిటీ అన్ని పరీక్షలు 30 వరకు వాయిదా

రాష్ట్ర పోలీస్‌ ‌శాఖను కొరోనా మహమ్మారి కలవరపెడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఎవరో ఒకరికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవుతుంది. కరోనా సమయంలో ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కొరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొరోనా థర్డ్ ‌వేవ్‌లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కొరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌ ‌నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సేవలు అందిస్తున్న పలువురు పోలీసులకు వరుసగా కొరోనా వొస్తుండటం అధికారు లను కలవరపెట్టిస్తుంది. కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విధులు నిర్వహించాలంటే పోలీస్‌ ‌సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీస్‌ ‌స్టేషన్‌కు ఒక్క ఫిర్యాదుదారుడు మాత్రమే రావాలని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే పోలీస్‌ ‌శాఖలో 90 శాతం మంది సిబ్బంది కొరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు బూస్టర్‌ ‌డోస్‌ ‌సైతం వేగంగా ఇవ్వాలని అధికారులకు అదేశాలు జారీ అయ్యాయి. •మ్‌ ‌గార్డ్ ‌క్యాడర్‌ ‌నుంచి ఐపీఎస్‌ ‌క్యాడర్‌ ‌వరకు అందరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌టీకా తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.యాదగిరిగుట్ట పోలీసుల స్టేషన్‌ ‌లో కోవిడ్‌ ‌కేసుల కలకలం రేగుతుంది. ఇప్పటివరకు మొత్తం 12 మందికి కొరోనా వైరస్‌ ‌సోకింది. ఏసిపి, సిఐ, 10 కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ ‌నిర్దారణ అయింది. ఇటు హైదరాబాద్‌ ‌నగరంలోని జీడిమెట్ల, రాజేందర్‌నగర్‌,‌దుండిగల్‌,‌పేట్‌బషీరాబాద్‌, ‌పోలీస్‌స్టేషన్లలో దాదాపు 35 మంది పోలీసులకు కొరోనా పాజిటివ్‌ ‌రిపోర్టు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో రాజేంద్రనగర్‌ ‌పోలీస్‌స్టేషప్‌లో ఏకంగా 16 మంది పోలీసులకు వైరస్‌ ‌సోకింది. ఒక ఎస్‌ఐ, ఎఎస్‌ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు ఏడుగురు కానిస్టేబుళ్లకు కొరోనా సోకింది. అలాగే జీడిమెట్ల పోలీస్‌ ‌స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లుకు, పేట్‌బషీరాబాద్‌, ‌దుండిగల్‌ ‌పిఎస్‌లో ఒక కానిస్టేబుల్‌, ఒక •ంగార్డు కొరోనా బారిన పడ్డారు. మొత్తంగా..35 మందికి కోవిడ్‌ ‌సోకింది. వీళ్లంతా •మ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. 

Leave a Reply