- 41 సీఆర్పీసీ కింద కేసులు నమోదు.. నోటీసులపై రాజాసింగ్ ఆగ్రహం
- పై పీడీ యాక్ట్ నమోదు… వివిధ కేసుల్లో నిందితుడు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి హైదరాబాద్ పోలీసుల నోటీసులు జారీ చేసింది. ఒక్కే రోజు రెండు పోలీస్ స్టేషన్ల నుంచి రాజా సింగ్‌కు నోటీసులు ఇచ్చారు. 41 సీఆర్పీసీ కింద షాహీనాథ్ గంజ్, మంగల్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో.. రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తెలంగాణ పోలీసులు కుట్ర పనుతున్నారంటూ ఆరోపించారు. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులపై ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారంటూ రాజా సింగ్ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారని పోలీసులపై నిప్పులు చెరిగారు. ఇన్ని రోజులు తెలంగాణ పోలీసులు నిద్ర పోతున్నారా? అంటూ ప్రశ్నించారు. అయితే.. 2022 ఏప్రిల్ 12న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే..ఈ ఏడాది ఫిబ్రవరి 20న పోలీసులు యూపీ ఎన్నికల విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనేపథ్యంలో..ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి వోటేయకపోతే బుల్డోజర్లు వస్తాయంటూ.. యోగి ఆదిత్యనాథ్‌కు ••టేయకపోతే యూపీని వదిలి వెళ్లాల్సి వస్తోందని కూడా వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఈసీ రాజాసింగ్‌ను వివరణ కోరింది. రాజాసింగ్ వ్యాఖ్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు మంగళ్ హాట్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేయడమేకాకుండా.. రాజాసింగ్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ. ఇప్పుడు ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు… వివిధ కేసుల్లో నిందితుడిగా అరెస్ట్ చేసి జైలుకు తరలింపు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశాక, భారీ భద్రత నడుమ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. గత ఫిబ్రవరిలో యూపీ ఎన్నికల సందర్భంగా అలాగే ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంగళ్ హాట్, షాయినాత్ గంజ్ పీఎస్ లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. తనను నగర బహిష్కరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ రాజాసింగ్ సెల్ఫీ వీడియో విడుదల చేసిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ వార్త తెలిసి కార్యకర్తలు, అభిమానులు రాజాసింగ్ ఇంటికి భారీగా చేరుకోవడంతో హై టెన్షన్ ఏర్పడింది. సిటీలో మునావర్ ఫారూఖీ పోగ్రామ్ జరగటానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలేనని సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారూఖీనే అని స్పష్టం చేశారు. తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని..మహమ్మద్ ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. హిందూ ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటే.. అందుకు కారణం ఎంఐఎం నేతలేనని రాజాసింగ్ ఆరోపించారు.