- 33 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
- 2లక్షల 31వేలు దాటిన మరణాలు
- రష్యా ప్రధానికి కూడా పాజిటివ్
ప్రపంచవ్యాప్తంగా కొరోనా వైరస్ కేసులు పెరుగుతూ దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కొరోనా కేసుల సంఖ్య 33 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 4,070 కొత్త కొరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు మొత్తం 33,08,290 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 278 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 2,34,105 మంది మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో కొరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.
అమెరికాలో కొత్తగా 187 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 10,95,210 ఉండగా, ఇవాళ ఐదుగురు మరణించారు. అలాగే ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 63,861 మంది మృతిచెందారు. ఇక స్పెయిన్‌లో విజృంభన కొనసాగుతోంది. ఇప్పటి వరకు స్పెయిన్‌లో మొత్తం 2,39,639 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 24,543 మంది చనిపోయారు.ప్రపంచ వ్యాప్తంగా మహాబీభత్సం సృష్టిస్తున్న నోవెల్ కరోనా వైరస్ బారినపడ్డ వారిలో సుమారు 10 లక్షల మంది కోలుకున్నారు. ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ తన డేటాలో పేర్కొన్నది.