Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా

  • సోమవారం 412 కొత్త కేసులు
  • ప్రజల్లో మళ్లీ ఆందోళన

రాష్ట్రంలో కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 412 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,03,867 కి చేరింది. ఇందులో 2,99,042 మంది కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా, 3,151 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో వైరస్‌ ‌బాధితులు ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 1,674కు చేరుకుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది.

కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన ఒక్కరోజులో 68,171 మందికి కొరోనా పరీక్షలు చేశారు. కొరోనా నుంచి 216 మంది కోలుకున్నారనిప్రజారోగ్యశాఖ వారు వెల్లడించారు. 1,285 మంది హోంక్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని వారు వెల్లడించారు. గడిచిన ఒక్కరోజులో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కొత్తగా 103 మంది కొరోనా బారినపడ్డారని అధికారులు పేర్కొన్నారు. స్వీయనియంత్రణతోనే కొరోనా కట్టడి సాధ్యమనివారు స్పష్టం చేశారు.

అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, బయటకు వొచ్చినప్పుడు విధిగా ఆరు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని వారు ప్రజలను కోరారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం విధించిన కొరోనా నిబంధనలను పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

Leave a Reply