Take a fresh look at your lifestyle.

మరో 12మంది జర్నలిస్టులకు కొరోనా

వారికి 20వేల చొప్పున ఆర్థిక సాయం: అల్లం నారాయణ

 నగరంలో కొత్తగా 12మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ ‌వచ్చినందున ఆ 12 మంది జర్నలిస్టులకు కూడా ఒక్కొక్కరికి 20వేల చొప్పున, క్వారంటైన్‌లో ఉన్న 5 మంది జర్నటస్లుకు 10వేల చొప్పున 2లక్షల 90వల రూపాయల ఆర్ధిక సాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర డియా అకాడ ఛైర్మన్‌ అల్లం నారాయణ ప్రకటించారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చిన 99 మంది జర్నలిస్టులకు 20వేల చొప్పున 19లక్షల 80వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా •ంక్వారంటైన్‌లో ఉన్న 52 మంది జర్నలిస్టులకు 10వేల చొప్పున 5లక్షల 20వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 151 మంది జర్నలిస్టులకు మొత్తం 25 లక్షల రూపాయలను డియా అకాడ నిధుల నుంచి అందించామని అల్లం నారాయణ తెలిపారు. కరోనా వైరస్‌ ‌బారిన పడిన పాజిటివ్‌, ‌క్వారంటైన్‌జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్‌ ‌రిపోర్టులు అకాడ కార్యాలయానికి తప్పని సరిగా పంపించాలని సూచించారు. జర్నలిస్టు మిత్రులు తమ వివరానలు తెలంగాణ రాష్ట్ర డియా ఛైర్మన్‌ ‌వాట్సప్‌ ‌నెం. 8096677444 కు పంపాలని అన్నారు. మరిన్ని వివరాలకు డియా అకాడ మేనేజర్‌ ‌సెల్‌నెం. 9676647807ను సంప్రదించాలని అన్నారు.

Leave a Reply