Take a fresh look at your lifestyle.

ఈశాన్య దిల్లీ లో కొరోనా కేసు..!

ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలు జరిగిన చోట కరోనా వైరస్ పెను భూతంగా మరి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈశాన్య ఢిల్లీలో మౌజ్‌పూర్ నడిబొడ్డు ప్రాంతం. ఇక్కడ ఒక కరోనావైరస్ కేసు నమోదు అయ్యింది.  మౌజ్‌పూర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్ అనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని వైద్యుడు కరోనా వైరస్‌ పాజిటివ్ గా తేలారు. డాక్టర్ తో పాటు అతని భార్య, కుమార్తె కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ ప్రాంతంలో 900 మందిని నిర్బంధంలో ఉంచాలని అధికారులు ఏర్పాట్లు చేశారు.  మార్చి 12న సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన ఓ మహిళ క్లినిక్‌ కి వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఆ మహిళ నుంచి డాక్టర్‌కు ఈ వైరస్ వచ్చిందని చెబుతున్నారు. మార్చి 12 నుంచి 18 మధ్య క్లినిక్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేశారు.
ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల తర్వాత శివపురి గోకుల్ పూర్ ప్రాంతాలలో జరిగిన మత హింస కారణంగా సర్వం కోల్పోయిన వారు రిలీఫ్ క్యాంపులలో వుంటున్నారు. వీరు సోషల్ డిస్టెన్స్ పాటించటం ఎంతమాత్రం సాధ్యం కాదు. దీనితో రిలీఫ్ క్యాంపులు కూడా మూతపడుతున్నాయి. ఉండడానికి ఇల్లు లేక, చేతిలో పని లేక, నిస్సహాయ స్థితిలో మత ఘర్షణల్లో సర్వం కోల్పోయిన వారు ఉన్నారు.

Leave a Reply