Take a fresh look at your lifestyle.

ఏపీలో 11 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలు రాయిని చేరుకుంది. గురువారం ఉదయం 9 నుంచి 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 11,15,635కి చేరింది. వరుసగా మూడో రోజు కూడా కరోనా నుంచి కోలుకుని వెయ్యి మందికి పైగా.. 1,040 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194కి చేరింది. 1,608 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. మొత్తం మరణాలు 292కు చేరాయి. యాక్టివ్‌ ‌కేసులు 11,936
ఉన్నాయి.  ఇన్ఫెక్షన్‌ ‌రేటు  – 2.28% ,రికవరీ రేటు – 51.90% ,మరణాల రేటు  – 1.15%

ఎపిలో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్‌ ‌కేసులు
మొత్తం 17  మంది కరోనా పేషెంట్ల మృతి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ‌బులిటిన్‌ ‌విడుదల

అమరావతి,జూలై 11 : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన  34 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ‌బులిటిన్‌ ‌విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 14393 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరం ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. అనంతపురం,కడప,విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మొత్తం 17  మంది కరోనా వైరస్‌ ‌బారినపడి  మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 309 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 27,235కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 12,533 యాక్టివ్‌  ‌కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 11,36,255 కరోనా  నిరార్ధణ  పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల్లో కరోనా కలవరం పుట్టిస్తోంది. రూరల్‌ ఎమ్మెల్యే గన్‌మెన్‌, ‌కోవూరు ఎమ్మెల్యే పీఏలకు కరోనా పాజిటివ్‌ ‌వచ్చినట్లు తెలిసింది. దీంతో రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయంను మూసివేశారు. జిల్లాలో 28మంది నేతలకు కరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయినట్టు సమాచారం. ఐసోలేషన్‌ ‌లో నేతలు చికిత్స పొందుతున్నారు.

 

Leave a Reply