Take a fresh look at your lifestyle.

పెద్దపల్లి జిల్లాలో కొరోనా ఉధృతం

  • పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం
  • పట్టణ ఆరోగ్య కేంద్రాలకు రాపిడ్‌ ‌కిట్లు..
  • పరీక్షల నిర్వహణలో సిబ్బంది విఫలం

పారిశ్రామిక జిల్లా పెద్దపల్లిలో కొరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తుంది. సామాన్య ప్రజలు ఎప్పుడు ఎవరిని ఏరకంగా కబళిస్తోందోననే భయాందోళనలకు లోనవుతున్నారు. ఆదివారం వరకు జిల్లా వ్యాప్తంగా మొత్త 608 కేసులు నమోదు కాగా ఒక్కరోజే 37 కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్యాధికారులు ధృవీకరించారు. సింగరేణి కార్మికులు, వైద్య అధికారులు, సిబ్బంది, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు మొదలు సామాన్య జనం కూడా వైరస్‌ ‌బారిన పడి కకావికలమవుతన్నారు. బయటకు వెళ్ళకపోతే కుటుంబ పోషణ కరువవుతుందనే బాధ ఒక వైపు ఉండగా మరోవైపు ఎక్కడ కొరోనా బారిన పడుతామనే ఆందోళనలో ఆందోళనకుకు గురవుతున్నారు. అయితే వ్యాప్తి చెందకుండా కోసం ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో విఫలమవుతున్నారు. పెద్ద ఎత్తున కొరోనా పరీక్షలు నిర్వహించేందుకు కిట్లను పంపిస్తున్నామని చెబు తున్నప్పటికీ వాటి నిర్వహణ తీరు తెన్నులను పరిశీలి ంచడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

మొన్నటి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లలోనే పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది గత మూడు రోజుల నుండి ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. అర్బన్‌ ‌హెల్త్ ‌సెంటర్‌, ‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య బృందం లేకపోవడం, ఉన్నప్పటికీ వారికి కనీస శిక్షణ లేకుండానే కొరోనా పరీక్షలు నిర్వహిస్త్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కనీస శానిటైజేషన్‌, ‌పరిశుభ్రత లేకపోవడంతో మరిన్ని సమస్యలు ప్రబలే అవకాశాలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొరోనా లక్షణాలున్నవారు నేరుగా హాస్పిటల్‌కి వెళ్ళిన క్రమంలో పైరవీలు ఉంటే తప్పితే పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో డాక్టర్లు ఉండడం గమనార్హం. రోజుకు 80 మంది వరకు అనుమానితులు పరీక్షలకోసం వస్తుండగా కేవలం 20 నుండి 30 వరకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తూ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఆరోగ్య కేంద్రాలకు రాపిడ్‌ ‌యాంటీజెన్‌ ‌కిట్లను పంపిణీ చేశామని చెబుతున్న వైద్యాధికారులు అక్కడికి వెళితే పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. వారిలో చాలా మందికి సరైన శిక్షణ, అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఎంతో మంది పరీక్షల కోసం వచ్చి వెనుదిరిగి పోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

నియంత్రణలో సీఎం విఫలం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు, సోమారపు సత్యనారాయణ
కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నియంత్రణలో సీఎం కేసీఆర్‌ ‌పూర్తిగా విఫలమయ్యారని, పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది తెలంగాణలోనే అని, వందలాది కిట్లు ప్రైమరీ, అర్భన్‌ ‌హెల్త్ ‌సెంటర్లకు పంపిస్తున్నామని చెబుతున్న వైద్యాధికారులు వారికి సరైన శిక్షణ ఇవ్వకపోవడడం, నిర్వహణ లోపం వలన వైరస్‌ ‌వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని, ఇంకా ఎక్కువగా సిబ్బందిని పెంచి పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్‌ ‌చేసి సరైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ డిమాండ్‌ ‌చేశారు.

వైద్య విధాన పరిషత్‌ ‌కమిషనర్‌కు విన్నవించా: రామగుండం ఎమ్మెల్యే, కోరుకంటి చందర్‌
‌రాపిడ్‌ అం‌టిజన్‌ ‌కిట్లను పెంచాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ‌కమిషనర్‌ ‌రమేష్‌ ‌రెడ్డిని కోరానని, ప్రభుత్వ హాస్పిటల్‌, ‌ప్రాథ•మిక ఆరోగ్య కేంద్రాల్లో ఎఎన్‌ఎం‌ల నియమాకం జరుపాలని, వెకెన్సీ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

ఆరోగ్యశ్రీలో కొరోనా వైద్యంను చేర్చాలి : సీపీఐ నాయకులు మద్దెల దినేశ్‌
‌కొరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి సామాన్యులకు సరైన వైద్య సదుపాయం కల్పించాలని, కొరోనా పరీక్షలు సామాన్యులకు అందలేకపోతుందని, ఒక సెంటర్‌కు వెళితే ఇంకో హెల్త్ ‌సెంటర్‌కు వెళ్ళమని వైద్య సిబ్బంది కొరోనా అనుమానితులను తిప్పి పంపిస్తుందని, ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైన సౌకర్యాలు, మరుగు దొడ్లు కూడా కామన్‌గా ఉండడంతో కూడా కొరోనా వ్యాప్తి తీవ్రరూపం దాల్చే అవకాశాలున్నాయని, ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ విద్యా సంస్థలు అందుబాటులో ఉండగా వాటిలో ఐసోలేషన్‌ ‌సెంటర్లుగా వినియోగించాలని సీపీఐ తరుపున డిమాండ్‌ ‌చేస్తున్నామని సీపీఐ మద్దెల దినేష్‌ అన్నారు.

కొరోనా పరీక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నాం : జిల్లా వైద్యాధికారి, ప్రమోద్‌కుమార్‌
‌జిల్లాల్లో కొరోనా పరీక్షలు నిర్వహించడానికి రాపిడ్‌కిట్లను రోజు రోజుకు పెంచుతున్నామని, ఇప్పటివరకు అర్టిఫిషియల్‌ ‌టెస్టులు నిర్వహణ సుల్తానాబాద్‌లోనే ఉండగా గోదావరిఖనిలో కూడా ఏర్పాటు చేస్తున్నామని, అనుమానం ఉన్న ప్రతి వ్యక్తిని పరీక్షలు నిర్వహించేలా తమకు ప్రభుత్వం నుండి సూచనలు లేవని, లిమిటెడ్‌ ‌కిట్లు మాత్రమే వస్తున్నందున లక్షణాలున్న వారికే పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌ ‌కుమార్‌ అన్నారు.

Leave a Reply