Take a fresh look at your lifestyle.

ఖైరతాబాద్‌ ‌గణనాథునికి కొరోనా ఎఫెక్ట్

  • ఈ ఏడాది ఒక్క అడుగు విగ్రహమే ప్రతిష్
  • గణేష్‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ ‌గణనాధునికి కొరోనా సెగ తగిలింది. ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించే గణేష్‌ ఉత్సవ కమిటీ కొరోనా నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ ‌నగరంలో కొరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కేవలం ఒక్క అడుగు గణనాథుని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతీ ఏడాది విగ్రహ తయారీ పనులకు అంకురార్పణగా నిర్వహించే కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఉత్సవ సమితి మంగళవారం ప్రకటించింది. ఈ కార్యక్రమం ఈనెల 18న జరగాల్సి ఉంది. కాగా, వినాయక చవితి సందర్భంగా 11 రోజులూ ఖైరతాబాద్‌ ‌గణనాథుని విగ్రహం వద్ద భక్తులతో కోలాహలం నెలకొంటుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడి• గణనాథుని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే, ఈసారి మాత్రం ఒక్క అడుగు గణనాథుని విగ్రహమే భక్తులను కనువిందు చేయనుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!