ఈ ఏడాది హొలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు సామూహిక సమావేశాలు తక్కువగా చేయాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. దీంతో ఒకే ప్రదేశంలో వేలాది మంది సామూహికంగా •లీ వేడుకలను నిర్వహించుకుంటున్న విషయం విదితమే. ఇలాంటి కారణాలతో •లీ వేడుకల్లో పాల్గొనరాదని ప్రధాని నిర్ణయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇదే విధంగాహోలీ వేడుకల్లో పాల్గొనని తెలిపారు.