Take a fresh look at your lifestyle.

కొరోనా ఎఫెక్ట్ అం‌తరంగికంగానే స్వామివారి తెప్పోత్సవం – ఉత్తరద్వారదర్శనం

భద్రాచలం, ప్రజాతంత్ర ప్రతినిది,జనవరి 11: కొరోనా వైరస్‌ ‌కొత్త ఓమిక్రాన్‌ ‌భారీగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం పక్కాగా ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే ఆలయాల్లో భక్తుల రద్దీని క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 12వ తేది బుధవారం నాడు గోదావరి నదిలో నిర్వహించనున్న స్వామివారి తెప్పోత్సవాన్ని రద్దు చేసారు. ఆలయంలోనే ప్రత్యేకమైన టబ్బు ఏర్పాటు చేసి దానిలోనే స్వామివారిని ప్రదర్శనగా నిర్వహించారు. అర్చకులు, ఆలయ సిబ్బంది సమక్షంలోనే స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు చేసారు.

తెలుగు వార్తలు, Telugu News Headlines Breaking News Now, Today Hilights, Prajatantra News, Telugu Kavithalu, Telangana updates

అంతేకాకుండా వైకుంఠఠ ఉత్తర ద్వారదర్శనం నిర్వహణకు కూడ అధికారులు భారీగా ఏర్పాటు చేసారు. కొరోనా వైరస్‌ ‌తీవ్రతను బట్టి గురువారం తెలల్లవారుజామున జరుగనున్న ఉత్తర ద్వారదర్శనమును అర్చకులు, అధికారులు ఆలయ సిబ్బంది సమక్షంలోనే స్వామివారి ఉత్తర ద్వారదర్శనం నిర్వహించనున్నారు. డిసెంబర్‌ ‌నెలలో కొరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సుమారుగా 50 లక్షల రూపాయలతో ఏర్పాట్లు చేసింది.

ఆలయానికి రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలు అలంకరించింది. ఆలయం వద్ద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనుబంధ దేవాలయాలను కూడ సుందరంగా తీర్చిదిద్దారు. పర్ణశాల ఆలయాన్ని కూడ భక్తులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ముందుగా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం గోదావరి నదిలో ఏర్పాటు చేయాలని భావించిన అధికారులు హంస వాహానాన్ని సిద్దం చేసారు. ఏర్పాట్లు పూర్తైనప్పటికి కొరోనా ప్రభావం తీవ్ర కావడంతో విరమించుకున్నారు. కేవలం ఆలయంలోనే అంతరంగికంగా తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శనం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

స్వామివారి అవతారాలు నిత్యకల్యాణం మండపం వద్దే
ఈ ఏడాది కొరోనా ప్రభావంతో స్వామివారి అవతారాలు కూడ కేవలం కొద్దిమంది భక్తుల దర్శనంతోనే నిత్యకల్యాణ మండపం వద్ద నిర్వహించారు. 3వ తేది సోమవారం నుండి ప్రారంభమై స్వామివారి వివిధ అవతారాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రతీ ఏటా స్వామివారు కల్యాణమండపం వద్ద తిరువీధి నిర్వహిస్తూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి మండపంలో ఏర్పాటు చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వివిధ అవతారాల్లో ఉన్న స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకునే వారు ఈసారి కొరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో నితత్యకల్యాణ మండపం వద్ద స్వామివారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

రాపత్తు ఉత్సవాలు రద్దు
వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారిని వివిధ ప్రాంతాల్లో స్వామివారిని తీసుకువెళ్ళి రాపత్తు ఉత్సవాన్ని నిర్వహించే ఆనవాయితీ గత కొన్నేళ్ళుగా వస్తుంది. ఈ సారి కొరోనా ప్రభావంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తుంది. కేవలం నిత్యకల్యాణ మండపం వద్దే రాపత్తు ఉత్సవాలను నిర్వహించ•డానికి దేవస్థానం అధికారులు నిర్ణయించారు.

టిక్కెట్లు తీసుకున్న వారికి డబ్బులు వాపస్‌
‌స్వామివారి ఉత్తర ద్వారదర్శనంకు భక్తులకు అనుమతి లేనందున ముందుగా ఆన్‌లైన్‌ ‌ద్వారా టిక్కెట్లు బెక్‌ ‌చేసుకున్న భక్తులకు వెబ్‌సైట్‌ ‌ద్వారానే ఆ సొమ్మును వారివారి ఖతాలో జమ చేయబడుతుందని దేవస్థానం ఈఓ శివాజీ తెలిపారు. కరోనా ప్రభావంతో ఉత్తర ద్వారదర్శనం అనుమతి లేనందున ఈ సొమ్మును తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply