Take a fresh look at your lifestyle.

గణేష్‌ ఉత్సవాలపై కొరోనా ప్రభావం

వినాయక చవితి వస్తుందంటేనే భారతావనిలో గ్రామ గ్రామాన, వాడ వాడలో రెండు మూడు నెలల ముందు నుండే ఉత్సవ శోభ సంతరించుకునేది .ఏ గల్లి లో చూసిన పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు  ‘‘గణేష్‌ ‌మహారాజ్‌ ‌కి జై ‘‘ అంటూ ఫుల్‌ ‌జోష్‌లో ఉండేవారు .కానీ ఈ సంవత్సరం ఆ రకమైన వాతావరణం కనబడుట లేదు. నినదించే మొహల పై ఎన్‌95 ‌మాస్కులు వచ్చిచేరాయి . చేతుల్లో చందా పుస్తకాల బదులు హ్యాండ్‌ ‌శానిటైజర్‌ ‌లు దర్శనమిస్తున్నాయి .శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం మరియు బౌద్ద సాంప్రదాయాలలో భారత్‌, ‌నేపాల్‌, ‌చైనా, టిబెట్‌ ‌మరియు ఇండోనేషియా దేశాల్లో కూడా అందరి వాడిగా పూజింపబడే గణేషున్ని కూడా కొరోనా భూతం వదలటంలేదు.

వినాయక చవితి ఉత్సవాలు సమాజంలో సోదర భావాన్ని పెంపొందిస్తాయి. చిన్నచిన్న అపార్ట్‌మెంట్‌ ‌నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద వీధుల్లో వరకు అందరూ సంఘటితమై ఉత్సవాలు నిర్వహిస్తారు. మండపాలు ఏర్పాటు నుండి నిమజ్జనం వరకు ఒక కమిటీగా ఏర్పడి నవరాత్రులు జరుపుతుంటారు. ఆయా అపార్ట్‌మెం•లలో వీధుల్లో ప్రజల మధ్య వున్న చిన్న చిన్న తగవులు అపార్థాలు  కూడా దూరమై అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. నవరాత్రుల్లో ప్రసాద వితరణ అన్నదానాలు ఇలా అందరిలో దానగుణాన్ని పెంపొందిస్తాయి. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్టేజ్‌ ‌ఫియర్‌ ‌పోవడమే కాక అందరితో కలివిడిగా మెలగడం, అంతర్గతంగా ఉన్న ఆర్గనైజింగ్‌ ‌స్కిల్స్ ‌మెరుగవడం, వారిలోని వ్యక్తిగత ప్రతిభ బయటకు రావడం చూస్తుంటాము .మరీ ముఖ్యంగా పట్టణాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దూరమై వ్యక్తిగత చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో సూర్యోదయంతో మొదలైన యాంత్రిక జీవనం సూర్యాస్తమయం అయ్యాకే ముగియటం మనుషులకు మనుషుల మధ్య మానవ సంబంధాలు ఎండమావులుగా మారుతున్న తరుణంలో ఆ సంబంధాలకు జీవం పోసే జడివానలా ఉపయోగపడుతుంది ఈ గణేష్‌ ఉత్సవాలు. పెద్దలే కాక చిన్న పిల్లలు కూడా చందాలు వేసుకుని వినాయక ఉత్సవాలు నిర్వహించడం మనం చూస్తుంటాం. ఇక్కడ వీరికి ఆర్థిక నిర్వహణ కార్యక్రమ రూపకల్పన వ్యూహాలు వెరసి ఒక చక్కని నాయకత్వ లక్షణాలు అబ్బెలా చేస్తాయి  ఈ ఉత్సవాలు. ఇప్పుడు ఈ వైరస్‌ అం‌దరిని వీటికి దూరం చేసేలా ఉంది.

మిలియన్‌ ‌డాలర్ల వ్యాపారం కొరోనార్పితం
బొజ్జ గణపయ్య ప్రతిఏటా భక్తులు సమర్పించే నైవేద్యాలను సృష్టిగా ఆరాధించడమే కాకుండా చాలామంది సిజినల్‌ ‌చిరు వ్యాపారుల బక్కచిక్కిన కడుపులు నింపే వాడు. చిన్న గ్రామం నుండి పెద్ద పట్టణాల వరకు, ఓల్డ్ ‌సిటీ నుండి హైటెక్‌ ‌సిటీ వరకు, అర అడుగు నుండి అరవై అడుగుల వరకు లక్షలాది మండపాలలో వినాయక విగ్రహాలు ప్రతిష్టించబడేవి. ప్రత్యేకంగా భాగ్యనగరంలోని పాతబస్తీ ధూల్‌పేటలో వినాయక విగ్రహాలతయారీ ఒక పరిశ్రమగా రూపు దిద్దుకొంది. ఇక్కడ వినాయక చవితి నుండి దసరా నవరాత్రుల వరకు ఈ వ్యాపారం సాగుతుంది.ఉత్తర భారతదేశం నుండి ఈ కార్మికులు రాజస్థాన్‌ , ‌బెంగాళ్‌, ‌బీహార్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌మొదలైన రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వలస వస్తారు. సంవత్సర ఆరంభం నుండే విగ్రహాల తయారీ మొదలెడతారు. కానీ ఈ సంవత్సరం మార్చి నుండే వైరస్‌ ఉపద్రవం ఉప్పేనల పొట్టచేత్తో పట్టుకొచ్చిన వలస కార్మికులపై కరాళ నృత్యం చేసి  వారిని అప్పుల  ఊబిలోకి  నెట్టేసింది..ఎందుకంటే  ముడిసరుకు లభ్యత తగ్గటమే కాక  కార్మికుల కొరత ప్రతిసారి లక్షల సంఖ్యలో వచ్చే ఆర్డర్స్ ఈసారి సుమారు 60 నుంచి 70 శాతం తగ్గిపోవడం వీరి పాలిట శరాఘాతంగా మారింది .మన రాష్ట్రం నుండే కాకా  చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా దూల్పేట్‌ ‌వచ్చి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేవారు. వినాయక చవితి వచ్చిందంటే చుట్టుపక్కల పల్లెల నుండి రైతులు మాచీ పత్రం, మారేడు, గరికె, ఉత్తరేణి, దేవదారు, మామిడి మొదలైన పత్రాలు, వెలుగ మొక్కజొన్న సీతాఫలాలు, పరిమళభరితమైన పుష్పాలు తెచ్చి విక్రయించేవారు .ఎలక్ట్రికల్‌ ‌డెకరేషన్‌, ‌డిజే సౌండ్‌ ‌సిస్టమ్స్ ‌వ్యాపారులు మరిముఖ్యంగా నవరాత్రుల్లో ప్రతి మండపాలలో తీరిక లేక పూజలు నిర్వహించే పంతుళ్ళు ,సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పాటలు పాడే సింగర్స్, ‌మిమిక్రీ ఆర్టిస్ట్, ‌స్టేజ్‌ ‌డాన్సర్స్  ఇలా ఒక రేమిటి అందరి పై పెను ప్రభావన్నే చూపింది ఈ మహామ్మరి. గణేష్‌ ‌నిమజ్జన సమయంలో ట్యాంక్‌ ‌బండ్‌ ‌పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయి ఆ సమయంలో చిరు వ్యాపారులకు స్వర్గధామం లా ఉండే ట్యాంక్‌ ‌బండ్‌ ఈసారి నిమజ్జనాలు లేకుండా బొసిపోయి ఉండే  పరిస్థితి కానవస్తుంది.
ముంబైలోని లాల్‌ ‌బాగ్‌, ‌హైదరాబాదులోని ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మండపాలు ప్రపంచంలోనే ప్రసిద్ధి. ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మండపాల లో నవరాత్రులు ఒక తిరునాళ్లను తలపిస్తాయి. ఇక్కడికి రాష్ట్రవ్యాప్తంగా నే కాక దేశ విదేశాల నుండి ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ పది రోజుల్లో ఇక్కడ పల్లీల నుండి పాప్‌ ‌కార్న్ ‌వరకు, టాయ్స్ ‌నుంచి టాటూస్‌ ‌వరకు వ్యాపారం జోరుగా సాగేది. కానీ ఈ సారి కొరోనా వైరస్‌ ‌భయంతో భక్తులు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితులు కానవస్తున్నాయి. ముంబై లాల్‌ ‌బాగ్‌ ‌గణేషుడు ఇరవై అడుగుల నుండి నాలుగు అడుగుల వరకు, ఖైరతాబాద్‌ ‌వినాయకుడు అరవై అడుగుల పొడుగు నుండి తొమ్మిది అడుగులకు తగ్గడం వైరస్‌ ‌తీవ్రతను తెలియ జేస్తుంది. ఈ వైరస్‌ ‌నుండి ప్రపంచానికి విముక్తి కొరకు ఈసారి  ఖైరతాబాద్‌ ‌గణపతి ధన్వంతరి అవతారం లో ప్రతిష్టించడం జరుగుతుంది. ‘‘గణపతి బప్పా మోరియా ‘‘ అగలి  బరస్‌ ‌తూ జల్ది  ఆ ‘‘అని ప్రార్థించే మనం ఇక  ‘‘గణపతి బప్పా మోరియా ‘‘  ఏ కరోణ వైరస్‌ ‌కో ఇస్‌ ‌ధునియా సే లేజా’’ అని ప్రార్థిద్దాం.

బొల్లం సునీల్‌ ‌కుమార్‌.
‌తెలంగాణ ఉపాధ్యయ సంఘం (తపస్‌) ‌జిల్లా ప్రధాన కార్యదర్శి , మహాబూబ్‌నగర్‌. 9059 666011

Leave a Reply