Take a fresh look at your lifestyle.

కొరోనా ప్రభావం హైదరాబాద్ లో ఎక్కువ…

  • లాక్ డౌన్ విధించే ఆలోచన మంత్రి ఈటల

తెలంగాణలో కొరోనా కేసుల పెరుగుదలపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్నాయని, అయితే మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. కేంద్రం సూచనల ప్రకారం కొరోనా కట్టడిపై చర్యలు తీసుకున్నామన్నారు. కొరోనా ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగానే ఉందన్నారు. హైదరాబాద్‌లో మళ్లీ రేపటి నుంచి కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తామని ఈటల తెలిపారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందిస్తామన్నారు. ‘ముఖ్య మంత్రి హైదరాబాద్ లో లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. కేబినెట్ పెట్టీ నిర్ణయం తీసుకుందామని చెప్పారు.. Ghmc లో కంటైన్ మెంట్ జోన్ లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు.ప్రభుత్వ హాస్పిటల్ల ల్లో పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా లో దుష్పచారం బాధాకరం…
చెస్ట్ హాస్పిటల్ లో కి వచ్చిన పేషంట్ అనేక హాస్పిటల్ కి తిరిగిన తరువాత వచ్చారాని …అర్ధ రాత్రి వచ్చినా కూడా చేర్చుకొని రాత్రి అంతా ఆక్సిజన్ ఇచ్చాము.. కానీ ఆయన గుండె జబ్బుతో చనిపోవడం బాధాకరం..ఆక్సిజన్ అందిచలేదు అనడం నిజం కాదు అని మంత్రి వివరణ ఇచ్చారు.258 మందికి హెల్త్ వర్కర్స్ కి పాజిటివ్ వచ్చింది.. చెస్ట్ హాస్పిటల్ లో హీడ్ నర్స్ విక్టోరియా చనిపోయిందని… హెల్త్ సెక్రెటరీ ఆఫీస్ లో 11 మందికి కరోనా సోకింది, అందరికీ గాంధీ లో చికిత్స అనిస్తున్నామన్నారు.

ఒక్కరు చనిపోతే ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేసే సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయవద్దు అని కోరారు. సీఎం చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు అని మంత్రి మాట్లాడుతూ ..తెలంగాణ లో ప్రస్తుతం 17081 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3500 ఆక్సిజన్ పైప్ లైన్ సిద్ధంగా ఉంది. మరో 6500 బెడ్స్ రెండు రోజుల్లో అందిస్తాం. మొత్తం 10 వేల బెడ్స్ ఆక్సిజన్ తో సిద్దం అవుతున్నాయి. రాష్ట్రం లో బెడ్స్ కి కొదువలేదు.
అనవసరం గా ప్రైవేట్ కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని మంత్రి ఈటల సూచించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!