- నిట్ విద్యార్థికి కరోనా లక్షణాలు
- అప్రమత్తమైన వైద్యాధికారులు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) క్యాంపస్‌కు చెందిన విద్యార్థికి కోవిడ్ 19 (కరోనా వైరస్) లక్షణాలుగా తేలడంతో ఒక్కసారిగా వైద్య అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో ఎటువంటి కరోనా కేసులు లేవని రాష్ట్రంలో కూడా ఎటువంటి కేసులు లేవని చెబుతూ వస్తున్న అధికారులు ఒక్కసారిగా వరంగల్ నగరంలో అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉండే నిట్ క్యాంపస్‌లోని విద్యార్థికి కరోనా లక్షణాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన ఎలక్ట్రికల్ విద్యార్థి జాఫర్ అనే స్కాలర్ విద్యార్థి ఇటీవల అమెరికాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో పాల్గొని తిరిగి వరంగల్‌కు చేరుకోవడం జరిగిందని, గత ఐదు రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ నయం కాకపోవడంతో వైద్య నిపుణుల సూచన మేరకు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా ఐసొలేషన్ వార్డులో చికిత్స నిమిత్తం చేర్పించారు.
కాగా జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు జరిగింది. అయితే సదరు విద్యార్థి ఈ నెల 8న అమెరికాలో జరిగిన •కాన్ఫరెన్స్‌లో పాల్గొని తిరిగి వరంగల్‌కు చేరుకున్నప్పటికీ క్యాంపస్‌కు రాలేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అప్పటికే అస్వస్థతకు గురైన విద్యార్థి ఎంజిఎంలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.