Take a fresh look at your lifestyle.

కొరోనా అంతం కాలేదు.. సడలింపు మాత్రమే ఇచ్చాం

  • ప్రతి ఒక్కరికి బియ్యం, నగదు అందజేత
  • ముస్లింలకు తోఫా పంపిణీలో మంత్రి హరీష్‌రావు

కరోనా వైరస్‌ ఇం‌కా.. అంతం కాలేదు. ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపు మాత్రమే చేసిందని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో బుధవారం రంజాన్‌ ‌పండుగ పురస్కరించుకొని పట్టణంలోని ఖాదర్‌ ‌పురా, వడ్డెర కాలనీ, నాసర్‌ ‌పురాకు చెందిన 2 వేల మంది ముస్లిం సోదరులకు రంజాన్‌ ‌పండగ కానుక- తోఫాలను పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ ‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కొ•రోనా వైరస్‌ ‌రోజూ రోజూకు హెచ్చు తగ్గులవుతుందన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ప్రజల జీవనం ఇబ్బందిగా మారిందని తెలంగాణ ప్రభుత్వం సీఏం కేసీఆర్‌ ‌నేతృత్వంలో ప్రతి రేషన్‌ ‌కార్డు దారుడికి ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.1500 మొదటి విడత, రెండవ విడతలో అందజేసిందన్నారు. కొరోనాకు మందు రావడానికి సమయం పడుతుందన్నారు. కొరోనాతో పేదవారు పనిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.

కొరోనాను అంతం చేయాలంటే.. మనమంతా ప్రభుత్వం చెప్పిన సూచనలు, ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే.. వెయ్యి రూపాయలు జరిమానా విధుస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి రోజూ ముఖానికి పసుపుతో ఆవిరి పడుతూ మూడు సార్లు వేడి నీరు తాగాలని సూచించారు. ప్రజలు అత్యవసరంగా బయటకొస్తే.. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా మనిషిలో ప్రవేశించేది గొంతులోకి, ఆ తర్వాత అవయవాలపై ఆ వైరస్‌ ‌దాడి చేస్తుందన్నారు. జలుబు చేస్తే ఆవిరి పట్టినట్లు, పసుపు వేసి ఆవిరి పట్టాలని ప్రజలకు సూచించారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. మాకేం అవుతుంది. ఏం కాదులే అనే నిర్లక్ష్యంగా ఉండోద్దన్నారు. అనవసరంగా బయట తిరగొద్దు. తిరిగి ఇంటి వాళ్లకు కరోనాను అంటిచొద్దన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనాను ఎదుర్కొందామని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సెన్‌, ‌ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!