Take a fresh look at your lifestyle.

ఉద్యోగ, ఉపాధులను కబళించిన కొరోనా

(‘‘సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ-2020’’  సర్వే)

మానవాళి కోవిడ్‌-19 ‌కోరల్లో చిక్కి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ నియమావళి పాటిస్తూ జీవనోపాధి వెతుకులాటలో నీరసించిన పోతున్నది. కొరోనా ప్రభావం సమాజ వ్యాధి లక్షణమై అన్ని రంగాలకు వేగంగా పాకి జనజీవనం అయో మయంలో పడింది. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలకు దినదిన గండమైంది. ఉపాద్యాయులు సైతం పనికి ఆహార పథకం ఆశ్రయించి మట్టి పనికి దిగారు. ఉపాధి కొల్పోయిన శ్రామికులు, పదిమృదికి వడ్డిృచిన హోటల్‌ ‌సిబ్బంది పస్తులపాలయ్యారు. ఉద్యోగ ఉపాధులను మింగిన కొరోనా ఆర్థికాన్ని నలిపి, ఆకలి పెంచి, మానవుని ముప్పు తిప్పలు పెడు తోంది. ఆర్థిక  స్థితి పుంజు కోవడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర భారత్‌ ‌పథకాలకోసం ఎదురు చూపులు మిగిలాయి. . కోవిడ్‌-19  ఉద్యోగ ఉపాధు లపై పడిన ప్రభావాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సియంఐ సంస్థ నిర్వహించిన సర్వే, తాజా నివేదికలో కఠిన వాస్తవాలు బయటపడ్డాయి.
కోవిడ్‌-19 ‌ప్రభం జనానికి భారతదేశంలో ఆర్థికాభివృద్ధి స్పందించడం తో పాటు ఉద్యోగ ఉపాధుల కోతతో జనజీవనం అతలాకుతలం కావడం జరిగిందనే కఠిన చేదు వాస్తవాలను ‘సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ’ అధ్యయనం ప్రకారం  దేశ ఆర్థికస్థితి  తిరిగి గాడిలో పడడానికి ఉద్యోగ ఉపాధులు పెరుగుతూ, పారిశ్రామిక ప్రగతి రథం పురోగమన దిశలో పయనించాల్సిన అవసరం ఉంది.  2020 అక్టోబర్‌ 24‌న  నిరుద్యోగం రేటు జాతీయ స్థాయిలో 7 శాతం, పట్టణ ప్రాంతంలో 7.5 శాతం,  గ్రామీణంలో 6.8 శాతం ఉంది. దేశవ్యాప్తంగా ఎంప్లాయిమెంట్‌ ‌రేటు  2019-20లో 39.4 శాతం, 2020 సెప్టెంబరులో 38శాతం, అక్టోబర్‌ ‌మూడో వారంలో 37.9 శాతం నమోదైనాయి. వ్యవసాయమే ప్లాధాన్యమైన  గ్రామీణ ఆర్థికాన్ని దిగజారకుండా అదుపు చేయడానికి ఉద్యోగ ఉపాధి రేటు తగ్గకుండా చూడాలని సూచించారు.

దేశంలో నిరుద్యోగం రేటు ఈఏడాది మార్చిలో 8.75 శాతం కాగా, లాక్‌డౌన్‌ ‌ఫలితంగా ఏప్రిల్‌లో 23.52 శాతానికి పెరగడంతో ఆర్థికాభివృద్ధికి విఘాతం ఏర్పడింది.  మే 2020 తరువాత ఉద్యోగ ఉపాధుల కల్పన కొంత మెరుగై నట్లు తేలినప్పటికీ, పూర్వ స్థితి రావడానికి  ఇంకొన్ని నెలలు వేచిఉండాలి.  లాక్‌డౌన్‌ ‌కారణంగా నిరుద్యోగుల సంఖ్య పెరిగింది.  సెప్టెంబరులో దేశ నిరుద్యోగ రేటు 6.67 శాతం కాగా తెలంగాణలో 3.3 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6.4 శాతంతో మెరుగుగా ఉండడం కొంత ఊరట. సెప్టెంబర్‌  ‌లో అస్సాం 1.2, ఛత్తీస్‌ఘడ్‌ 2.0, ఒడిసా 2.1, కర్నాటక 2.4, గుజరాత్‌ 3.4 ‌శాతం నిరుద్యోగ రేటు నమోదు చేసుకున్నాయి. సెప్టెంబర్‌ ‌లో అధికంగా  నిరుద్యోగ రేటు నమోదైన రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌ 22.4, ‌హర్యానా 19.7, త్రిపుర 17.4, జమ్ము కాశ్మీర్‌ 16.2, ‌రాజస్థాన్‌ 15.3 ‌శాతంగా తేలాయి. నిరుద్యోగ సమస్య గ్రామీణంకంటే  పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది.

గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాధార ఉపాధి అవకాశాలు పడిపోలేదని, పట్టణాలలోనే ఉద్యోగ ఉపాధులు తగ్గిపోయాయని తేలిందది.  సెప్టెంబర్‌ ‌నెలలోనే పట్టణాల్లో 46 లక్షల శ్రామికులు ఉపాధి కోల్పోయారు. సేవా, విద్య, వర్తక వాణిజ్య రంగాలు, శ్రమతో కూడిన ఉపాధి పడిపోవడమే , నిరుద్యోగ సమస్యకు కారణం అయ్యింది. ఉద్యోగ ఉపాధులు పూర్వ స్థితికి పుంజుకోవడానికి 2021 జనవరి – మార్చి వరకు వేచి చూడాల్సిందే అని అంచనా. నిరుద్యోగ రేటు నిర్ణయించే సియంఐఈ సర్వేలో 15 సంవత్సరాలు దాటిన పౌరులను పరిగణలోకి తీసుకున్నారు.
 అసంఘటిత రంగంలో ఉద్యోగ ఉపాధులు 2019-20 లో 317.6 మిలియన్లు ఉండగా, జూలై-2020 నాటికి 325.6 మిలియన్లకు పెరగడం విశేషంగా చెప్పారు. వస్త్రపరిశ్రమలో 29, ఆటోమొబైల్‌ అనుబంధ పరిశ్రమలో 21, తోలు పరిశ్రమలో 22.5, ఆటోమొబైల్స్ ‌పరిశ్రమలో 18.6, టూరిజంలో 30, హోటల్‌ ‌పరిశ్రమలో 20.5, రోడ్డు రవాణాలో 27.6, విద్యారంగంలో 28, రియల్‌ ఎస్టేట్‌లో 21 శాతం వేతన బిల్లులు తగ్గడం నిరుద్యోగుల దుస్థితిని తెలుపుతుంది. టెలికమ్‌లో మాత్రం వేతన బిల్లులు 10.7 శాతం పెరిగాయని గుర్తించారు. కరోనా పూర్వ స్థితికి చేరి, బతుకు బండి గిర్రలకు జీతం కందెనలు అద్ది, పని పాటలతో మనుషులు చల్లగా బతకాలని ఆశిద్దాం. కరోనాను క్రమశిక్షణతో తరమడమే ఏకైక మార్గం.

Leave a Reply