Take a fresh look at your lifestyle.

ఎపిలో 198కి చేరిన కొరోనా మరణాలు

అమరావతి,జులై 2 :  ఏపీలో కొత్తగా 845 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో 812 కేసులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లలో 29 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లలో నలుగురికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 198కి చేరింది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో అత్యధికంగా 134 కేసులు, తూర్పుగోదావరిలో 122, గుంటూరులో 104, కడపలో 101 కేసులు నమోదు కావడంతోపాటు కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 75 కేసులు, ప్రకాశం జిల్లాలో 79, పశ్చిమగోదావరిలో 53 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 16,097 కేసులు నమోదు కాగా, ఇందులో 8,586 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 7,313 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Leave a Reply

error: Content is protected !!