Take a fresh look at your lifestyle.

తప్పుడు లెక్కలతో… కొరోనా మరణాలను తక్కువగా చూపుతున్నారు

రాష్ట ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

కొరోనా మరణాల విషయంలో తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైనన్ని టెస్టులు చేయనప్పుడు కేసుల సంఖ్య తగ్గిందని ఎలా చెబుతారని ప్రశ్నించింది. రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కొరోనా తగ్గుముఖం పట్టిందని అధికారులు హైకోర్టుకు తెలిపారు. దీనికి హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం చెబుతూ ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయనప్పుడు కొరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు. టెస్టుల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

Leave a Reply