- వారు వస్తే మళ్లీ అభివృద్ధి కుంటుపడుతుంది
- భాస్కర్ నేతృత్వంలో ఐదుగురు సంచారం
- కూంబింగ్‌లో వారిని పట్టేస్తాం: డిజిపి
మరోమారు జిల్లాలో మావోయిస్టులు ప్రవేశిస్తే ఏం జరుగుతుందో గతానుభవాలు తెలుసని, అందువల్ల అలాంటి అవకాశం ఇవ్వరాదని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలు మావోయిస్టులపై సమాచారం ఉంటే తక్షణం తెలియచేయాలని అన్నారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో డిజిపి శుక్రవారం
జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఏఆర్‌హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. కూంబింగ్ ఆపరేషన్‌పై సక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ డియాతో మాట్లాడుతూ పదేళ్ళ నుంచి ఇక్కడ నక్సల్స్ కార్యకలాపాలు లేవని తెలపారు.
అయితే మళ్లీ ఐదుగురు మావోయిస్టులు తిరిగి జిల్లాలో సంచరిస్తున్నారని, మావోయిస్టు నేత భాస్కర్ నేతృత్వంలో ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతున్నారని వెల్లడించారు. మావోయిస్టులతో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతుందని వారికి ఆదివాసులు సహకరించొద్దని హెచ్చరించారు. 500 మంది ప్రత్యేక పోలీసులు కూంబింగ్ చేస్తున్నారని, త్వరలోనే మావోయిస్టులను పట్టుకుంటామని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులను కట్టడి చేస్తామని మహేందర్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో పదేళ్ల నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు లేవని, మళ్లీ ఐదుగురు మావోయిస్టులు తిరిగి ఎంటర్ అయ్యారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు నేత భాస్కర్ నేతృత్వంలో వారు ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతున్నారని చెప్పారు. ఆదివాసులు నక్సలైట్లకు సహకరించొద్దని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలను కట్టడి చేస్తామని అన్నారు.