కొరోనా మాయావి మనిషి
బలహీనత ఎరిగినట్లుంది
ప్రాణం రుచి మరిగినట్లుంది
అందుకే రూపాలు ఏమార్చి
విచ్చలవిడిగా రెచ్చిపోతుంది
కనుమరుగైనట్లు నటించి
అంతలోనే విజృంభిస్తుంది
దేశమంతటా వ్యాపిస్తూ
డేంజర్ బెల్స్ మోగిస్తుంది
మానవహననం గావిస్తుంది
ఇందుకు రోజు పెరుగుతున్న
పాజిటివ్ కేసులు నిదర్శనం
కళ్లెదుట చావు పొంచి ఉన్నా
లెక్కచేయక సంచరించే వైఖరి
ఆరోగ్యనిపుణుల హెచ్చరికలు
పెడచెవిన పెట్టిన పాప ఫలితం
కొరోనా వీర విహారానికి కారణం
అయినా ఇంకెంతకాలం
నిర్లక్ష్యం నెత్తికెత్తుకుందాం
చావుతో సహవాసం చేద్ధాం
శవయాత్రలు కొనసాగనిద్దాం
ఇకనైనా..
జనగణం మేలుకొని
మూతికి వస్త్రం దరిస్తే
టీకా మందు ఒంటికెక్కిస్తే
ఆరోగ్య సూత్రాలు ఆచరిస్తే
సామాజిక దూరాలు పాటిస్తే
నియంత్రణ అస్త్రాలు సందిస్తే
కొరోనా పలాయనం చిత్తగించు
స్వస్థ భారతం సాక్షాత్కరించు
(కొరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపధ్యంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493.