Take a fresh look at your lifestyle.

అనంతగిరిలో కరోనా దవాఖానా పరీశీలిస్తున్న ప్రభుత్వం

వికారాబాద్‌ ‌జిల్లాలోని అనంతగిరి అటవీప్రాంతంలో ఉన్న చెస్ట్ ‌దవాఖానను కరోనా ప్రత్యేక దవాఖానగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కరోనా వైరస్‌ ‌బాధితులు ఐసోలేషన్‌ ‌వార్డులలో ఉండాలని ఇదే శాస్త్రీయమని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆసుపత్రిని పరిగణనలోనికి తీసుకున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగితే మాత్రమే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అతి తక్కువ రోగులు ఉండి ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆసుపత్రులన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆసుపత్రి, ఫీవర్‌ ఆసుపత్రులలో కరోనా బాధితుల కోసం ఐసోలేషన్‌ ‌వార్డులను ఏర్పాటు చేయాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!