Take a fresh look at your lifestyle.

భారత్‌లో ప్రమాద ఘంటికలు

  • కీలక సమయంలో అండగా నిలవడంలో విఫలం
  • అభివృద్ది చెందిన దేశాలపై ఆంథోనీ ఫాసీ విమర్శలు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌28: ‌కీలకమైన సెకండ్‌వేవ్‌ ‌సమయంలో భారత దేశానికి అండగా నిలవడంలో ప్రపంచం విఫలమైందని అమెరికా చీఫ్‌ ‌మెడికల్‌ అడ్వయిజర్‌ ‌డాక్టర్‌ ఆం‌థోనీ ఫాసీ ఆరోపించారు. కోవిడ్‌-19 ‌రెండో ప్రభంజనంతో అతలాకుతలమవుతున్న భారత దేశానికి సహాయపడటంలో ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా సంపన్న దేశాలు విఫలమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం భారత దేశంలో రోజూ పెద్ద సంఖ్యలో కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసులు, దానికి సంబంధించిన మరణాలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఓ ప్రముఖ ఆస్టేల్రియన్‌ ‌పత్రికతో డాక్టర్‌ ‌ఫాసీ మాట్లాడుతూ, దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత దేశానికి సహాయపడేందుకు ప్రపంచ దేశాలు సంఘటితం కాలేకపోయాయన్నారు. భారత దేశంలో వ్యాపిస్తున్న విషాదం పట్ల అంతర్జాతీయంగా స్పందించేందుకు సంఘటితం కావలసిం దన్నారు.

ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానంగా అందుబాటులో ఉండేవిధంగా చేయడంలో సంపన్న దేశాలు విఫలమయ్యాయని తెలిపారు. అంతర్జాతీయ అసమానతలకు నిలువెత్తు ఉదాహరణ భారత దేశంలోని ప్రస్తుత పరిస్థితులని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త మహమ్మారి పట్ల సరైన రీతిలో స్పందించడానికి ఏకైక మార్గం కేవలం అంతర్జాతీయంగా స్పందించడమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్పందన అంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం ఉండటమని, దురదృష్టవశాత్తూ దీనిని సాధించలేకపోతున్నామని వివరించారు. సంపన్న దేశాలు ఈ బాధ్యతను స్వీకరించాలన్నారు.

బుధవారం ఉదయం కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గడచిన 24 గంటల్లో దాదాపు 3.60 లక్షల కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసులు కొత్తగా నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3 వేలు దాటింది. దీంతో కోవిడ్‌ ‌కారణంగా ప్రాణాలు కో?ల్పోయినవారి సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. జనవరి 16 నుంచి ప్రారంభమైన కోవిడ్‌-19 ‌నిరోధక వ్యాక్సినేషన్‌ ‌పక్రియలో ఇప్పటి వరకు 14.77 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ‌చేశారు. మే 1 నుంచి 18 సంవత్సరాల వయసు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్‌ ‌చేస్తారు. అయితే వయోజనులందరికీ వ్యాక్సినేషన్‌ ‌చేయడానికి తగిన వ్యాక్సిన్‌ ‌డోసులు తమకు అందుబాటులో లేవని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి.

Leave a Reply