Take a fresh look at your lifestyle.

‘‘‌తిలాపాపం తలా పిడికెడు ఫలితం…..

.. బూడిద అవుతున్న సామాన్యులు’’
భారత భూభాగంలో కొరోనా కరాళ నృత్యం చేస్తుంది. ప్రతి రోజు నాలుగు లక్షలకు పైగా నూతన కేసులు నమోదు అవుతుండటం ఇది వరుసగా నాలుగో రోజు….నాలుగు వేల మందికి పైగా చనిపోవడం రెండో రోజు. దేశంలోని 741 జిల్లాలలో 301 జిల్లాలో మే ఒకటో తేదీ నుండి 20 శాతం పైనే ఉంది . ఆక్సిజన్‌ అం‌దక ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు …. బెడ్లు లేక వీల్‌ ‌చైర్‌ ‌లలో వరండాలోనే చికిత్స పొందుతూ ఉండటం …… ఒకరు మరణిస్తే మరొకరికి బెడ్‌ ‌దొరుకుతున్న పరిస్థితి …….. కొరోనా ఉధృతి వల్ల రెమిడీస్వీర్‌ ఇం‌జక్షన్‌ అవసరం పెరగడంతో, ఇదే అవకాశంగా తీసుకొని ప్రైవేటు ఆసుపత్రులలో రెమెడీస్వీర్‌ ఇం‌జక్షన్‌ ‌బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌దందా జోరుగా సాగుతోంది . ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరోనా చికిత్స కు ప్యాకేజి ధరలు నిర్ణయించి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న ఆసుపత్రులలో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్న పరిస్థితి ….ఇది ఇలా ఉండగా కోవిద్‌ ‌మరణాలు పెరగడంతో స్మశాన ల వద్ద అంత్యక్రియల కోసం 10 నుంచి 12 గంటల పాటు నిరీక్షణ …….అంతిమయాత్రకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుండడంతో చావుల బాధను మించి అంత్య క్రియలు నిర్వహణ సామాన్యులను ఏడిపిస్తుంది .పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు ….ఎవరికి ఏ ఫోన్‌ ‌వచ్చినా భయం …..ఎవరి దగ్గర నుండి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని ,వాట్స్అప్‌ ‌ఫేస్బుక్‌ ‌లు తెరవడానికి వెన్నులో వణుకు పుడుతుంది. కనివిని ఎరుగని రీతిలో ఇంతటి భయానక వాతావరణానికి, విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు ? ప్రజలా ? పాలకులా ?అధికారులా ..? ఎవరిదీ పాపం.. ప్రస్తుతం ప్రజల అందరికీ శాపమైంది.

తిలాపాపం తలా పిడికెడు ఫలితంగా బూడిద అవుతున్న సామాన్యులు…..
భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 21 ‌జీవించే హక్కును కల్పించింది.ప్రజలు గౌరవప్రదంగా ఎటువంట ఆభద్రతకు లోను కాకుండా జీవించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తుంది .నేటి దుస్థితికి బాటలు వేయడానికి పాలకుల నిర్లక్ష్యమా..? అంటే అవుననే అంతర్జాతీయ మీడియా చెబుతోంది. సెకండ్‌ ‌వేవ్‌ ఉద్ధృతి గురించి అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తల బృందం గత రెండు నెలల క్రితమే హెచ్చరించిన పాలకులు పెడచెవిన పెట్టిన ఫలితమే నేటి ఈ దుస్థితి అని సెంటర్‌ ‌ఫర్‌ ‌సెల్యులర్‌ అం‌డ్‌ ‌మాలిక్యులర్‌ ‌బయాలజీ మాజీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రాకేష్‌ ‌మిశ్రా ఓ పత్రిక ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే నియమించిన. రోజు విడిచి రోజు సమావేశమై కొరోనా ఉపద్రవం పై చర్చించి ఎప్పటికప్పుడు సమాచారం అందిం చినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. మరి ఈ గడ్డు పరిస్థితులు ఏర్పడడానికి ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబించి నట్లు..? ప్రపంచ దేశాలన్నీ అతి జాగ్రత్తగా అందరికీ టీకా అందించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రజలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసి సఫలమైతే…. ప్రపంచ టీకా హబ్‌ , ‌ఫార్మా హబ్‌ ‌గా పేరుగాంచిన మన దేశం టీకాలనిల్వలు హరించుకుపోయి మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు కోసం ఎదురు చూస్తూ ఉండటం ఆశ్చర్యకరం. గత మూడు నెలల్లో 93 దేశాలకు 6.5 కోట్ల టీకాలు మనదేశం అందించిందని, అది ఇక్కడ వాడుకుంటే లక్ష మంది ప్రాణాలను నిలబెట్టుకునే వారమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది.

దీంతో ‘’తాను బుక్క తవుడు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె’’ అన్న చందంగా తయారయింది మన దేశ పరిస్థితి.. మన దేశానికి అవసరమయ్యే టీకా నిలువలు పెంచుకోకుండా ఎటువంటి ప్రణాళిక, నిర్దిష్ట విధానం లేకుండా వ్యాక్సిన్‌ ‌బయట దేశాలకు పంపడం, పంపిన తర్వాత కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి ఎటువంటి చర్యలుచేపట్టకుండా ఆ విషయాన్ని గాలికి వదిలేసి, అధికార అందలం కోసం ఐదు రాష్ట్రాల ఎన్నికలు,ఉప ఎన్నికలు, రాష్ట్రాలలో స్థానిక సంస్థల ,మున్సిపల్‌ ‌కార్పొరేషన్ల ఎన్నికల జాతరలు నిర్వహించడం మూలంగా ఎన్నికల ప్రచారాలకు, సభలు, ర్యాలీలకు, రోడ్‌ ‌షోలకు అనుమతులు ఇవ్వడంతో కొరోనా వ్యాప్తి విస్తృతంగా విజృంభించింది. • ప్రస్తుతం దేశమంతా అల్లకల్లోలంగా కొరోనా కరాల నృత్యంతో దారుణ మారణ హోమం జరుగుతుంది. ప్రాణవాయువు అందక ప్రాణాలు విలవిలలాడుతూ ఉండడం, ఆక్సిజన్‌ ‌బెడ్లు దొరకక, అవసరమయ్యే ఔషధాలు సరియైన చికిత్స అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న… ప్రభుత్వాలు చేతులెత్తేసి ఏమి చేయలేని పరిస్థితుల్లో అయోమయంతో చేష్టలుడిగి చూస్తుండడం అత్యంత బాధాకరం.. ప్రభుత్వ వవ్యస్థలు అన్ని అచేతనంగా తయారు కావడంతో ప్రైవేట్‌ ‌సంస్థల దోపిడీ నిరాటంకంగా జోరుగా సాగుతుంది. మానవతా దృక్పథంతో ప్రజల ప్రాణాలు కాపాడడానికి సేవ చేయవలసిన టువంటి కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇదే అదునుగా భావించి ఆరోగ్య సేవా రంగాన్ని, వ్యాపార రంగంగా మార్చి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా శవాలపైన పేలాలు ఏరుకుంటూ డబ్బు దండుకుంటున్న వైనం నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితిని చూసి ప్రపంచ దేశాలన్నీ జాలి చూపిస్తున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే దారుణాతి దారుణంగా విశ్వ మారి వికృతరూపం దాల్చింది. దీంతో ప్రజలంతా అతలాకుతలమై రెండు రాష్ట్రాలు రోగగ్రస్తం గా మారినాయి. రెండు రాష్ట్రాల పాలకులు నిర్లక్ష్య వైఖరితో చేతులెత్తేసి చోద్యం చూస్తున్నారు. ఈ ఆపత్కాల సమయం నుండి గట్టెక్కడానికి మార్గాలు అన్వేషించకుండా, ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమాలను భుజాన వేసుకున్నాయి . తమ ప్రత్యర్థులపై, ప్రశ్నించిన వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టి, ఎంక్వయిరీలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ కక్ష సాధింపు చర్యలకు కాలు దువ్వడం ఏ రాజ నీతో వారికే తెలియాలి . ప్రజల కోసం ప్రజల కొరకు పని చేయవలసిన ప్రభుత్వాలు ప్రజలను కరోనా వైరస్‌ ‌కు వదిలేసి తమ ఇష్టానుసారం వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.’’ నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం బలగం అధికారం నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను నేను హరించును. చివరికి అతని మాటలు నాపై విమర్శలు అయినా సరే’’ అదే ప్రజాస్వామ్యం అన్నారు అబ్రహం లింకన్‌. ‌కానీ నేటి పాలకులు నోరు విప్పే అవకాశం ఇవ్వడంలేదు.

పౌరులకు తన అభిప్రాయాల్ని వెల్లడించే స్వేచ్ఛ లేదు ఇది నేటి ప్రజాస్వామ్యం. పాలకులు ఎప్పటికప్పుడు కరోనా ఉదృతిని, వైద్య చికిత్సల పరిస్థితిని, ఔషధాల సప్లై సమీక్షించి సత్వర పరిష్కార మార్గాలు చేపట్టి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేయవలసిన తరుణంలో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఆసుపత్రులకు బడ్జెట్‌ ‌కేటాయింపులు, డాక్టర్ల సిబ్బంది నియామకాలు అంటూ ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం.. మూడో వేవ్‌ ‌వస్తుందని మూడు నెలల కోసం డాక్టర్ల నియామకం అనడం విడ్డూరం… ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలు అని అనుకుంటే రాబోవు విపత్తును సమర్థంగా ఎదుర్కోడానికి కార్యాచరణను రూపొందించుకొని సమాయత్తం కావాలి.

ఇతర దేశాలలో క్యూబా, న్యూజిలాండ్‌ ‌దేశాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లనన్నింటిని సిబ్బందితో, అన్ని రకాల ఎక్యుప్‌ ‌మెంట్‌ ‌తో ఆధునీకరించి, ప్రజలకు సరిపోయేంతగా సరైన చికిత్స అందే విధంగా హాస్పిటల్స్ ‌ను నెలకొల్పి, ప్రవేట్‌ ‌హాస్పిటల్స్ ‌లో కూడా ప్రజలకు అయ్యే చికిత్స ఖర్చులను సమీక్షిస్తూ , ఆఖర్చులను కూడా ప్రభుత్వమే భరించేలా సత్వర చర్యలు చేపట్టాలి. యుద్ధ ప్రాతిపదికన భారత ప్రజలకు అవసరమయ్యే టీకా నిల్వలను పెంచుకోవడానికి మరిన్ని ప్రభుత్వ సంస్థల తో టీకాలు ఉత్పత్తి చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుని, అవసరమైతే విదేశీ సంస్థల నుండి కూడా టీకాలుకొనుగోలు చేసి సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు అందించి ఈ కరోనా ఉపద్రవం నుండి బయటపడే మార్గాలు అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. లేనిచో ఇదే విధంగా ఉపేక్షిస్తే తగు మూల్యం చెల్లించుకోవాల్సి నా దుస్థితి ఏర్పడనుంది. ఇట్టి విషయాన్ని పాలక పెద్దలు గ్రహించి కార్యాచరణను మొదలు పెడతారని ఆశిద్దాం…

tanda sadhanandha
తండా సదానందం, టీపీటిఏఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌ ‌జిల్లా

Leave a Reply