Take a fresh look at your lifestyle.

ఎపిలో కరోనా మరణమృదంగం…

  • ఉధృతంగా సెకండ్‌వేవ్‌
  • ‌విజయనగరంలో ఆక్సిజన్‌ అం‌దక నలుగురు మృత్యువాత
  • విశాఖలో కరోనాతో కార్పోరేటర్‌ ‌రవికుమార్‌  ‌మృతి
  • నర్సీపట్నంలో కొడుకు మృతితో తండ్రి హఠాన్మరణం
  • చిత్తూరు జిల్లా టిడిపి నేత కఠారి ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌మృతి
  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై అటెండర్‌ ‌జములమ్మ మరణం
  • కర్నూలులో ఒకరు, కడపలో తండ్రీకొడుకులు మృత్యువాత
  • కరోనా చికిత్స తీసుకుంటున్న మాజీ ఎంపి సబ్బం హరికి సీరియస్‌

ఎపిలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌పీక్స్ ‌స్టేజ్‌లో ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వేగంగా విజృంభిస్తోంది.  కరోనా చాలాచోట్ల కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తోంది. ఆక్సిజన్‌ అం‌దక కొందరు.. చికిత్స సరిగా అందక మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం కరోనా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం దక్కడం లేదు. ఈక్రమంలో విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. మహారాజ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ ‌కొరతతో నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఓ కార్పోరేటర్‌ ‌మృతి చెందాడు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవి కుమార్‌ ‌కరోనాతో మృత్యువాత పడ్డాడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అటెండర్‌ ‌జములమ్మ మృత్యువాత పడ్డారు. పెళ్లింట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో కొడుకు మృతి చెందడంతో ఈ వార్తను తట్టుకోలేని తండ్రి గుండెపోటుతో మరణించారు. ఇకపోతే చిత్తూరు నగర టీడీపీ అధ్యక్షుడు, మాజీ మేయర్‌ ‌కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్‌ ‌కరోనాతో మృతి చెందారు. ఇకపోతే కరోనాతో ప్రైవేట్‌ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న మాజీ ఎంపి సబ్బం మరి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. ఆయన కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు.

కడప జిల్లాలోని పుల్లంపేటలో తండ్రీకొడుకులు మృతి చెందారు.  కొడుకులకు 10 రోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకున్నారు.కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆస్పత్రిలో చేరిన తండ్రి కొడుకులు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కృష్ణాజిల్లాలో అంబులెన్స్‌కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఓ పేషెంట్‌ ‌మృత్యువాతపడ్డాడు. ఇకపోతే విజయనగరం ఆస్పత్రిలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఆక్సిజన్‌ ‌కొరత ఏర్పడింది.  దీంతో కరోనా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు రోగుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగడంతో భారీగా పోలీసులు మోహరిం చారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్‌ ‌హరిజవర్‌లాల్‌ ‌హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మహారాజ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ ‌కొరతతో రోగులు చనిపోయిన ఘటనపై కలెక్టర్‌ ‌హరి జవహర్‌ ‌లాల్‌ ‌స్పందించారు. ఆస్పత్రిలో కేవలం ఇద్దరు మృతి చెందారని… వారు కూడా ఆక్సిజన్‌ ‌సరఫరా అందక చనిపోలేదని వివరించారు. రోజువారీ కరోనా మృతులు నేపథ్యంలో ఈ రెండు మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆక్సిజన్‌  ‌సరఫరాలో ఇబ్బంది తలెత్తిందని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బల్క్ ‌సిలిండర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఘటన జరిగిన సమయంలో మొత్తం 290 మంది రోగులు ఉన్నారని…వారిలో 25 మంది ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారందరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. వైజాగ్‌ ‌నుండి మరో ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ ‌తెప్పిస్తున్నామని… ఇతర పరిశ్రమల నుండి కూడా ఆక్సిజన్‌ ‌తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్‌లో ప్రెజర్‌ ‌తక్కువగా రావటం వల్ల ఇబ్బంది నెలకొందని వెల్లడించారు. ఇప్పటికే పునరుద్ధరణ చర్యలు చురుకుగా సాగుతున్నాయన్నారు. ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొందరు రోగులను తరలించామని… మరికొందరిని వైజాగ్‌ ‌తరలిస్తున్నట్లు కలెక్టర్‌  ‌హరిజవహర్‌లాల్‌ ‌తెలిపారు.

ఇకపోతే కృష్ణా జిల్లా కోడూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. కోడూరు శివారు మెరక గౌడపాలెంలో అంబులెన్స్ ‌రాకపోవటంతో కోవిడ్‌ ‌లక్షణాలతో వ్యక్తి మృతి చెందారు. సమయానికి అంబులెన్స్ ‌వచ్చి ఆక్సిజన్‌ అం‌దించి ఉంటే బతికేవాడని బంధువులు వాపోతున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మచిలీపట్నం కోవిడ్‌ ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ ‌కోసం ఎదురు చూస్తూ ఊపిరి అందక అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు. అధికారులేవరూ స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు. చిత్తూరు నగర టీడీపీ అధ్యక్షుడు, మాజీ మేయర్‌ ‌కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్‌ ‌కరోనాతో మృతి చెందారు. కరోనా పాజిటివ్‌తో గత వారం రోజుల క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ప్రవీణ్‌… ‌పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రవీణ్‌ ‌మృతితో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాతి వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలోని పుల్లంపేటలో తండ్రి కొడుకులకు 10 రోజుల క్రితం కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆస్పత్రిలో చేరిన తండ్రి కొడుకులు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పెనగలూరు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. విశాఖ నగరంలో కరోనా బారినపడి టీడీపీ కార్పొరేటర్‌ ‌మృత్యువాత పడ్డారు.

ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవి కుమార్‌.. ఇటీవల కోవిడ్‌ ‌బారిన పడ్డారు. ఆసుపత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన ఆయన.. అనాథ శవాల అంత్యక్రియలు లాంటి ఎన్నో సామాజిక కార్యకలాపాలు గతంలో నిర్వహించారు. కరోనా మహమ్మారి బారినపడి విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది… ఈ నెల 15వ తేదీన కరోనా బారిన పడిన సబ్బం హరి… ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు.. పది రోజుల క్రితం ఆయనకు కోవిడ్‌ ‌సోకినా.. మొదట్లో వైద్యులు సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు..  ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు.. గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మాజీ ఎంపీ.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply