Take a fresh look at your lifestyle.

అక్టోబర్‌లో కొరోనా కేసులు 70లక్షలు దాటుతాయి

  • అమెరికాను మించిపోతామంటున్న పరిశోధనలు
  • బిట్స్ ‌విద్యార్థుల అధ్యయనం వెల్లడి
 ‌కొరోనా కేసుల సంఖ్య పరంగా భారత్‌ అక్టోబర్‌లో అమెరికాను దాటిపోయే అవకాశం ఉందని బిట్స్ ‌పిలానీ సంస్థ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్‌ ‌క్యాంపస్‌కు చెందిన ముగ్గరు సభ్యుల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. గత నాలుగు నెలల్లో నమోదైన కొరోనా గణాంకాల ఆధారంగా రెండో మోడల్స్ ను రూపొందించిన శాస్త్రవేత్తలు.. కొరోనా కేసుల సంఖ్య పరంగా భారత్‌ ‌వచ్చే నెలలో అమెరికాను దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. ’అక్టోబర్‌ ‌తొలి వారంలో కొరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరుకోవచ్చు.
ప్రపంచంలోనే అత్యధిక కేసులు కలిగిన దేశంగా భారత్‌ ‌తొలిస్థానంలో నిలవచ్చు’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టీఎస్‌ఎల్‌ ‌రాధిక వ్యాఖ్యానించారు. ’సెప్టెంబర్‌ 5 ‌లేదా 6న  కేసుల సంఖ్యలో భారత్‌ ‌బ్రెజిల్‌ను దాటిపోతుందని గతంలో మేము అంచనా వేశాము. ఈ అంచనాకు అనుగుణంగానే సెప్టెంబర్‌ 7‌న భారత్‌ అత్యధిక కొరోనా కేసులు కలిగిన రెండో దేశంగా బ్రెజిల్‌ను అధికమించింది అని ఆమె తెలిపారు. గణాంకశాస్త్రానికి చెందిన ఆటోరిగ్రెస్‌, ‌గ్రోత్‌ ‌రేట్‌ ‌మోడళ్ల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామన్నారు.

Leave a Reply