Take a fresh look at your lifestyle.

వ్యక్తిగత జాగ్రత్తలతోనే కరోనా అదుపు : సుచరిత

సెకండ్‌ ‌వేవ్‌ ‌నుంచి బయట పడాలంటే వ్యక్తిగత జాగ్రత్త అవసరమని హోంమంత్రి సుచరిత తెలిపారు. సోమవారం హోంమంత్రి సుచరిత వి•డియాతో మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ మాస్క్ ‌వాడాలని, శానిటైజ్‌ ‌చేసుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటించాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని చెప్పారు. ఆక్సిజన్‌, ‌రెమ్‌ ‌డెసివిర్‌ ‌విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. భయాన్ని వదిలి పెట్టాలన్నారు. భయంతోనే మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.

Leave a Reply