సూర్యాపేటలో కొరోనా కలకలం
జిల్లా కేంద్రంలో కొరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి పాజిటివ్‌గా నిర్దారణ కావడం ఆందోళన పుట్టిస్తోంది. సప బంధువు అంత్యక్రియలకు హాజరైన వీరికి వైరస్ సోకింది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మరణించారు. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌కు చెందిన మృతుడి బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
అనంతరం వీరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోగా కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని డీఎంహెచ్ఓ హర్షవర్ధన్ తెలిపారు. బాధితుల్లో లక్షణాలేవీ కనిపించక పోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యాదాద్రి టౌన్ షిప్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా స్వీయ నిర్భందంలో ఉన్నారు.