Take a fresh look at your lifestyle.

తిరుమల ఉద్యోగుల్లో కొరోనా కలకలం

  • పదిమందికి వైరస్‌ ‌సోకినట్లు అనుమానం
  • అందరికీ పరీక్షలు చేయించి హోం క్వారంటైన్‌

‌తిరుమల,జులై 3 : లాక్‌డౌన్‌ ‌సడలింపులు ఇచ్చిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనానికి అవకాశం కల్పించారు. అయినా కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా టీటీడీలో 10 మందికి వైరస్‌ ‌సోకింది. వీరిలో స్వామివారికి పూజా కైంకర్యాలు చేసే అర్చకుడికి కూడా లక్షణాలు బయటపడటంతో కలకలం నెలకొంది. వెంటనే అధికారులు అప్రమత్తమై శానిటైజేషన్‌ ‌పనులు పూర్తి చేశారు. వైరస్‌ ‌సోకిన వారిలో నలుగురు సన్నాయి వాయిద్యకారులు, ఓ అర్చకుడు,ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టుగా వెల్లడించారు. దశల వారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేస్తుండగా.. తాజాగా వీరి శాంపిల్స్‌ను పరీక్షించారు. అందులో పాజిటివ్‌ అని తేలింది. వారందరినీ వెంటే ఆసుపత్రులకు తరలించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాలని టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్‌ ‌స్కీన్రింగ్‌ ‌ను చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారిని పైకి అనుమతించడం లేదు. వరుసగా టీటీడీలో సిబ్బందికి కరోనా సోకడం భక్తులను కూడా అయోమయానికి గురి చేస్తోంది.

మరోమారు శ్రీవారిని దర్శించుకున్న తమ్మినేని
తిరుపతి పర్యటలనో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ ‌తమ్మినేని సీతారాం తిరుమలలోని శ్రీవారిని మరోమారు దర్శించుకున్నారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఆయన తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు.  గురువారం కుటుంబసమేతంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న స్పీకర్‌ ‌శుక్రవారం మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన డియాతో మాట్లాడారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలంతా హర్షిస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దని, చంద్రబాబు అంటే తమకు గౌరవం ఉందని ఆయన అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply