Take a fresh look at your lifestyle.

కరోనా..చైనా జీవాయుధమా..?

‌”ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ ‌చైనా చేతిలోని జీవాయుధమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా శత్రు దేశాల పై ప్రయోగించేందుకు తయారు చేసిన జీవాయుధమే  బెడిసికొట్టి ఆ దేశాన్ని చుక్కలు చూపిస్తోందన్న కథనాలు బయటకు వస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు కథనాలు రాయటంతో ఈ దిశగా కూడా అనుమానించకుండా ఉండలేం. చైనా దేశ స్వభావం, ప్రపంచం పై పట్టు సాధించేందుకు ఎంతకైనా తెగించే దాని తీరును చూసినా కాదనే పరిస్థితి ఉండదు.”

Poisoning of the northeastern region, millions of people are infected1

ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వైరస్‌ ‌భయం గుప్పిట్లో వణుకుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అనేక దేశాల్లో ఈ వైరస్‌ ‌సోకిన కేసులు నమోదవుతున్నాయి. మధ్య చైనాలోని హుబే ప్రాంతంలో కరోనా వైరస్‌ ‌ప్రభావం ఎక్కువగా ఉంది. దీనితో హుబే ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో రాకపోకలను నిషేధించారు. చైనాకు బయట థాయ్‌లాండ్‌, ‌వియత్నాం, తైవాన్‌, ‌దక్షిణ కొరియా, సింగపూర్‌, ‌నేపాల్‌, ‌జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోనూ కరోనా వైరస్‌ ‌కేసులు నమోదయ్యాయి. మన దేశం కూడా దీనికి మినహాయింపు కాదు. కేరళలో మొదటి కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. చైనాలోని వూహాన్‌ ‌విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్ధికి ఈ వైరస్‌ ‌సోకిందట. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉన్నా…వైద్య బృందం పర్యవేక్షణలో రోగిని ఉంచారు. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్‌ ‌హుస్సేన్‌ ‌కరోనా వైరస్‌ ‌తో చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ వైరస్‌ ‌కారణంగా మరిణించిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా230కు దాటింది. సుమారు పది వేల మందికి వైరస్‌ ‌సోకినట్లు గుర్తించారు. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ‌హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దీంతో ఎక్కడ తమ దేశంలోకి ఈ వైరస్‌ ‌సోకుతుందో అని అనేక దేశాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. చైనా నుంచి వస్తున్న వారిని విమానాశ్రయాల్లోనే పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చైనా వస్తువులు మన దేశీయ వస్తుత్పత్తి మార్కెట్‌ను ఏ రకంగా ముంచెత్తుతుందో అందరికీ అవగాహనలో ఉన్న విషయమే. చైనా వస్తువుల స్థానంలో ఇప్పుడు చైనా వైరస్‌ అన్న ప్రచారం, సెటైర్లు సోషల్‌ ‌మీడియాలో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆందోళన పెంచుతున్న అసలు విషయం వేరే ఉంది. చైనా రహస్య జీవాయుధం తయారీ లీకై ఇలా బయటపడిందా అన్న అనుమానాలే ఇప్పుడు భయాందోళనలు కలిగిస్తున్నాయి.

కరోనా-చైనా చేతిలోని జీవాయుధమా:

- Advertisement -

Poisoning of the northeastern region, millions of people are infectedప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ ‌చైనా చేతిలోని జీవాయుధమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా శత్రు దేశాల పై ప్రయోగించేందుకు తయారు చేసిన జీవాయుధమే బెడిసికొట్టి ఆ దేశాన్ని చుక్కలు చూపిస్తోందన్న కథనాలు బయటకు వస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు కథనాలు రాయటంతో ఈ దిశగా కూడా అనుమానించకుండా ఉండలేం. చైనా దేశ స్వభావం, ప్రపంచం పై పట్టు సాధించేందుకు ఎంతకైనా తెగించే దాని తీరును చూసినా కాదనే పరిస్థితి ఉండదు. ఈ అనుమానాల వెనుక కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ‌చైనాలోని వుహాన్‌లో ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ వైరస్‌ ‌వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతానికి 30 కి.మీ. దూరంలోనే వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌బయోసేఫ్టీ లాబోరేటరీ ఉంది. పీ4 వైరాలజీ ల్యాబ్‌గా పిలుస్తారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్ ‌ల్యాబ్‌గా పని చేస్తోంది. ఈ పరిశోధనాశాలకు ఓ నేపథ్యం ఉంది. ఎబోలా, నిఫా లాంటి ప్రమాదకర వైరస్‌ల పై ఇక్కడ ప్రయోగాలు చేశారు. ఇప్పుడు కూడా బయో వెపన్‌ ‌తయారు చేస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు ఈ ల్యాబరేటరీ నుంచి వైరస్‌ ‌లీకైందన్నది ఓ వాదన. దీనికి తోడు చైనా ప్రభుత్వం ఈ వైరస్‌ను అరికట్టేందుకు పెద్దగా చర్యలు తీసుకోలేదని కూడా ఒక వాదన ఉంది. బయో సైన్స్‌లో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం, కరోనా వైరస్‌ ‌విషయంలో ఆ దేశం నోరు మెదపకపోవడం అనుమానాలకు ఊతం ఇస్తున్న మరో అంశం అయితే ఈ ప్రచారానికి, వాదనకు ఆధారాలు చూపించటం అంత తేలిక కాదు. అయితే అనుమానాలు, ప్రచారాలు మాత్రం ఆందోళనలు పెంచుతున్నాయి. అందులోనూ పొరుగున్న ఉన్న మన దేశం పై ఈ వైరస్‌ ‌ప్రభావం, భయం ఎక్కువగానే ఉంటుంది. ఈశాన్య భారతాన చైనా చొరబాటు ప్రయత్నాలు, దాయాది దేశం పాకిస్థాన్‌తో స్నేహం అందరికి తెలిసిన అంశాలే. చైనా ల్యాబ్‌ల్లో జీవాయుధం తయారు చేసే ప్రయత్నంగా ఇజ్రాయెల్‌ ‌లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌కూడా అనుమానం వ్యక్తం చేయటానికి కూడా ఏదో ఒక కోణం ఉండి ఉండాలి.

ఒక కరోనా-ఎన్నో వదంతులు:

Poisoning of the northeastern region, millions of people are infected1జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో పాటు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి మరణం కూడా సంభవించే కరోనా వైరస్‌కు న్యుమోనియా వ్యాధి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే సోషల్‌ ‌మీడియాలో వింతైనా ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇదిగో తోక అంటే అదిగో పులి లాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. కరోనా వైరస్‌ ‌గురించిన ఆందోళనలతో కరోనా బీర్‌ అమ్మకాలు తగ్గిపోవటం దీనికి ఒక ఉదాహరణ. పేరు ఒకటే కావటంతో ఈ బీరు తాగితే కరోనా వైరస్‌ ‌సోకుతుందన్న ఊహతో చాలా మంది మందు బాబులు ఈ బీరు కొనడం మానేశారంట. వినటానికి విచిత్రంగానే ఉన్నా…మనుషుల్లోని భయాందోళనలు, కొన్ని సందర్భాల్లో మానవ ప్రవర్తనకు ఇదో సంకేతం. హైదరాబాద్‌లోని ఓ ఎమ్మెల్యే పేరుతో అయితే ఏకంగా కోరుల్లా వైరస్‌ (‌కరోనా వైరస్‌ను ఫ్లెక్సీ పై అలా అక్షరీకరించారు) సోకకుండా ఉచిత మందుల పంపిణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఇక కొన్ని వాట్సప్‌ ‌గ్రూపుల్లో ఈ వైరస్‌ ‌బారిన పడకుండా ఉదయాన్నే అల్లం, తులసి ఆకుల రసం కలిపి తీసుకోవాలనే ప్రచారాలు బాగా సర్క్యూలేట్‌ అవుతున్నాయి. కొంత మంది చికెన్‌, ‌మటన్‌ ‌లాంటి నాన్‌ ‌వెజ్‌ ‌జోలికి పోవటానికి జంకుతున్నారు ఎక్కడ కరోనా సోకుతుందో అని. అటు కొన్ని చోట్ల వదంతులు సోషల్‌ ‌మీడియా వేదికగా పెరుగుతున్నాయి. కాకినాడలో పది మందికి ఈ వైరస్‌ ‌సోకినట్లు, నలుగురు చనిపోయినట్లు వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. ఇలా కరోనా వైరస్‌ ‌సోకుతుందన్న విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోని 114వ పద్యంలో ఆనాడే చెప్పారనే మరో ప్రచారం కూడా ఉంది. ‘‘ఈశాన్య దిక్కుల విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ, కోరంకియును, జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగ తూగి సచ్చేరయ’’ అని రాసుందన్న కొందరు వాట్సప్‌ల్లో ప్రచారం చేస్తున్నారు. ఎవరి సృజనాత్మకత వారిది. చేతిలో సోషల్‌ ‌మీడియా ఉంటే ఇక ఆపగలిగేది ఎవరన్నట్లు సాగుతున్నాయి కరోనా వదంతులు. ఇటువంటి ప్రచారాలు, వదంతులు ప్రభుత్వాలు తీసుకునే సీరియస్‌ ‌చర్యలకు ఆటంకం కలిగిస్తుంటాయి. ఈ సమయంలో కరోనా వైరస్‌ ‌పై సరైన అవగాహన, అప్రమత్తత అందరికీ అవసరం.

Tags: A Corona many rumor,social media, rehana, Poisoning of the northeastern region, millions of people are infected

Leave a Reply