- కేసులతో పాటు మరణాల సంఖ్యలోనూ పెరుగుదల
- కొత్తగా 43,733 పాజిటివ్ కేసులు నమోద
- వైరస్ ప్రభావంతో మరో 930 మంది మృత్యువాత
దేశంలో కొరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగడం ఆందోళన కలిగిస్తోంది. 40వేలకు దిగువన నమోదైవుతూ వస్తున్న కేసులు బుదవారం మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 47,240 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో మరో 930 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,63,665కు పెరిగింది. మొత్తం 2,97,99,534 మంది బాధితులు కోలుకున్నారు.
మహమ్మారి ప్రభావంతో 4,04,211 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,59,920 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.29శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. టీకాల పంపిణీ కార్యక్రమంగా వేగంగా సాగుతున్నదని తెలిపింది. మొత్తం 36.13 కోట్ల డోసులు టీకా డ్రైవ్‌లో పంపిణీ చేసినట్లు వివరించింది. నిన్నటి వరకు మొత్తం 42.33 కోట్ల కొరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది
కొరోనా నిబంధనలు ప్రజలు పాటించాలి
థర్డ్ వేవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ..!
న్యూఢిల్లీ,జూలై7: కొరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలు కొరోనా నిబంధనలు పాటించకపోతే.. మరోసారి ఆంక్షలను విధించాల్సి ఉంటుందని తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. యాక్టివ్ కేసులు సంఖ్య 5 లక్షల దిగువకు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గుర్తుచేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, ఆంధప్రదేశ్, అరణాచల్ ప్రదేశ్, త్రిపుర.. రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి మించిందన్నారు.భవిష్యత్తులో ప్రధాన సవాల్.. మూడో వేవ్ కాదని, దానిని మనం ఎలా ఎదుర్కొన్నాం అనేదే ముఖ్యమని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. బలరాం భార్గవ వెల్లడించారు.
హిల్ స్టేషన్లకు పర్యటకులు పోటెత్తటంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, మనాలీలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కొరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న 73 జిల్లాలకు లేఖ రాసింది వైద్య శాఖ.