Take a fresh look at your lifestyle.

దేశంలో ఆందోళన కలిగిస్తున్న కొరోనా కేసులు

  • లాక్‌డౌన్‌ ‌సడలింపులతో ..
  • పెరుగుతున్న పాజిటివ్‌లు
  • అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్న వైద్యులు

దేశంలో కొరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ ‌నిబ ంధనలు సడలించడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే టెస్టులు విస్తృతంగా చేస్తే వీటి సంఖ్య మరింత బయటపడగలదని భావిస్తున్నారు. మొత్తంగా ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న సమయంలో సడలింపులు ఇవ్వడం కేసులు పెరిగేందుకు మరొక కారణం అవుతున్నది అనడంలో సందేహం అవసరం లేదు. తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో ఇండియాలో 6088 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,18,447 కేసులు నమోదుకాగా, 3,583 మంది మరణించారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇదిలా ఉంటె ప్రపంచంలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగుతున్నాయి. గత 24 గంటల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మొత్తం ద ఇప్పటి వరకు 51.32 లక్షల కేసులు నమోదు కాగా, 3.34 లక్షల మందికి పైగా మరణించారు. అమెరికా, రష్యాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

ఇకపోతే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6088 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కరోనా వల్ల గురువారం దేశవ్యాప్తంగా 148 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,18,447కి చేరింది. ప్రస్తుతం దేశంలో 66,330 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదేవిధంగా చనిపోయిన వారి సంఖ్య 3583కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 48,553 మంది డిశ్చార్జ్ అయ్యారు.మహారాష్ట్రలో 2345 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదకావడం ఇదే మొదటిసారి. దాంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 41,600 దాటింది. అలాగే గురువారం 64 మంది చనిపోవడంతో.. మహారాష్ట్రలో కరోనా మరణాలు 1454 చేరాయి.హైదరాబాద్‌: ‌దేశంలో నోవెల్‌ ‌కరోనా వైరస్‌ ‌కేసులు రోజు రోజూ అధికం అవుతున్నాయి.గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 6088 కొత్త కేసులు నమోదు

Leave a Reply