Take a fresh look at your lifestyle.

ఎపిలో పెరుగుతున్న కొరోనా కేసులు

అమరావతి,జులై 3 : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 789 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో ప్రతిరోజు దాదాపు తొమ్మిదొందల కేసుల వరకు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 38,898 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 837 కరోనా పాజిటీవ్‌ ‌కేసులు నమోదయ్యయని, కరోనాతో మరో తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ ‌బులెటిన్‌లో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేసింది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్ ‌పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,71,611 పరీక్షలు నిర్వహించారు.

ఇతర రాష్టాల్ర నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ ‌సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 258 క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. వైరస్‌ ‌బారిన పడి 8 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,096 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా సోకగా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన 46మందికి పాజిటీవ్‌ ‌వచ్చిది. దీంతో రాష్ట్రంలో మొత్తం 16,934 కరోనా పాజిటీవ్‌ ‌కేసులు నమోదయ్యాయి. .ఇక, రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 206మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 9,096 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,632 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కర్నూలు జిల్లాల్లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 206కి పెరిగింది. ఆస్పత్రుల్లో చికిత్స తర్వాత ఇప్పటి వరకు 7,632 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Leave a Reply

error: Content is protected !!