Take a fresh look at your lifestyle.

తెలంగాణలో 77కు చేరిన కరోనా కేసులు

  • ఇప్పటి వరకు ఆరుగురు మరణం
  • 13మందికి నయం కావడంతో డిశ్చార్జ్
  • కరోనా బారిన పడ్డ నాంపల్లి చిన్నారి
  • ఢిల్లీ మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారితోనే వ్యాప్తి

తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 77 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. అయితే వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ తెలంగాణలో మొత్తంగా ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారి వివరాలు తెలంగాణ సీఎమ్‌ఓ అధికారికంగా ప్రకటించింది.మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ‌ప్రాంతంలో గల మర్కజ్‌ ‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ ‌సోకినట్లు తెలిపింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్‌ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్‌ ‌లో, ఒకరు గద్వాలలో మరణించారు. వీరి ద్వారా వైరస్‌ ‌సోకే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు అనుమానితులను గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నారు. మర్కజ్‌ ‌ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ ‌సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి సూచిస్తుంది. వారందరికీ ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స కూడా అందించాలని నిర్ణయించింది.

కాబట్టి మర్కజ్‌ ‌వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియచేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరుతున్నది. చికిత్స పొందుతున్న వారిలో అందులో 13 మందిని సోమవారం డిశ్చార్జ్ ‌చేయగా, మరో బాధితుడు ఇది వరకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంటే మొత్తం 14 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఈ మేరకుతెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ ‌విడుదల చేసింది. డిశ్చార్జి అయినవారు, చనిపోయిన వారిని తీసేస్తే, మిగిలినవారు కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జి అయిన 13 మందిలో ఇండోనేషియాకు చెందిన 9 మంది, వారితో వచ్చిన ఢిల్లీ, యూపీకి చెందిన ఇద్దరున్నారు. వారితోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన యువతి, నగరానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం పాజిటివ్‌ ‌వచ్చిన ఏడుగురి వివరాలను వెల్లడించకుండా దాచిపెట్టిందన్న విమర్శలున్నాయి.

సీఎం కార్యాలయం స్పష్టంగా ప్రకటించినా, వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉండిపోయింది. నాలుగు రోజుల క్రితం నిలోఫర్‌ ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేరిన శిశువు కు కరోనా పాజిటివ్‌ ‌నిర్దారణైంది. దీంతో చిన్నారిని ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతనికి లోకల్‌ ‌కాంటాక్ట్ ‌ద్వారా వైరస్‌ ‌సోకినట్లు వైద్యులు గుర్తించారు. శిశువుకు క్లోజ్‌ ‌కాంటాక్ట్‌లో తల్లిదండ్రులతో పాటు డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, పీజీలు, స్టాఫ్‌ ‌నర్సు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పీజీలు ప్రస్తుతం జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ శిశువుకు చికిత్స చేసిన ఈఎస్‌ఆర్‌లోనే మరో 20 మంది పిల్లలు, వారికి సహాయంగా వచ్చిన తల్లిదండ్రులు ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఈ ఘటనతో ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులతో పాటు విదేశాల నుంచి వచ్చిన ఆరేళ్ల బాలునికి కరోనా పాజిటివ్‌గా ఇప్పటికే నిర్దారణైన విషయం తెలిసిందే. తాజాగా నాంపల్లికి చెందిన చిన్నారి కూడా కరోనా బారిన పడటంతో ఈ వ్యాధిబారిన పడిన పిల్లల సంఖ్య రెండుకు చేరింది. నిమోనియా, జ్వరంతో బాధపడుతూ ఈ బాలుడు నిలోఫర్‌ ‌చేరగా, కరోనాగా తేలింది.

Leave a Reply