Take a fresh look at your lifestyle.

దేశంలో క్రమంగా కొరోనా కొత్త కేసుల తగ్గుదల

24 గంటల్లో తాజాగా 44,111 మందికి పాజిటివ్‌
దేశంలో కొరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. దేశ వ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ ‌వేవ్‌ ‌హెచ్చరకల నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తలు కూడా కేసుల తగ్గుదలకు దోహపదడుతున్నాయి. ఈ క్రమంలో రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం తగ్గుతున్నాయి. 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. తాజాగా 57,477 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ‌ప్రభావంతో 24 గంటల్లో 738 మరణాలు నమోదయ్యాయని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,05,02,362కు పెరిగాయి. 2,96,05,779 మంది బాధితులు కోలుకున్నారు.

వైరస్‌ ‌ప్రభావంతో 4,01,050 మంది మృత్యువాతపడ్డారు. మరో వైపు దేశంలో యాక్టివ్‌ ‌కేసులు 95 రోజుల తర్వాత 5లక్షలకు దిగువకు చేరాయి. ప్రస్తుతం 4,95,533 యాక్టివ్‌ ‌కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 34,46,11,291 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. రికవరీ రేటు 97.06 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.50శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.35శాతంగా ఉందని వివరించింది. ఇప్పటి వరకు 41.64 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.

Leave a Reply