Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా 136 కొరోనా కేసులు

అమరావతి,జూన్‌ 10 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 136 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 15,384 శాంపిల్స్‌ను పరీక్షించగా వీరిలో 136 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 22 మంది వ్యాధి నుంచి కోలుకుని నేడు డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,126 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 1,573. కోవిడ్‌-19 ‌కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 78 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,475 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Leave a Reply