Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో .. కొరోనా విజృంభణ

తెలంగాణలో కొరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 700 పాజిటీవ్‌ ‌కేసులు నమోదుకాగా 18 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు వైరస్‌ ‌బారి నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక 496 మందికి చికిత్స అందిస్తున్నారు. తాజాగా కుమ్రంభీం జిల్లా జైనూరులో అధికారులు మరొక కొరోనా పాజిటీవ్‌ ‌కేసు నిర్దారించారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న మరొకరికి పాజిటీవ్‌ ‌వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జైనూర్‌, ‌కరీంగూడ, పాట్నాపూర్‌ ‌గ్రామాల్లో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. పాజిటీవ్‌ ‌వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్ అయినవారు స్వచ్చంధంగా క్వారంటైన్‌కు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకూ సేఫ్‌ ‌జోన్‌లో ఉన్న మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ ‌కేసు నమోదైంది. ఈ నెల 14న హైదరాబాద్‌లో మరణించిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె స్వగ్రామం చెన్నూరు మండలం ముత్తరావుపల్లిలో హైఅలర్ట్ ‌ప్రకటించారు. ఇకపోతే సిద్ధిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలం మల్లంపల్లిలో కరోనా కలకలం రేగింది. ఓ యువకుడు తుమ్ములు, దగ్గు, జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్నాడు.

- Advertisement -

సమాచారం అందిన వెంటనే వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని యువకుడిని సిద్ధిపేట క్వారంటైన్‌కు తరలించారు. 20 రోజుల క్రితం యువకుడు హైదరాబాద్‌ ‌నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. యువకుడిని క్వారంటైన్‌కు తరలించడంతో మల్లంపల్లి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పోలీసుల పహారా కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్‌ ‌నగరంలో కంటైన్‌మెంట్‌ ‌క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో గట్టి నిఘా కొనసాగుతోంది. పోలీసులు, జీహెచ్‌ఎం‌సీ, వైద్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సక్షిస్తున్నారు. కరోనా అనుమానం వస్తే వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మలక్‌పేటలో అధికారులు దాదాపు 10 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో కేసులు ఉండడంతో ఈ ఏర్పాట్లు చేశారు. రేస్‌ ‌కోర్స్‌వద్ద క్లస్టర్‌ ‌కంటైన్‌ ‌వద్ద ఒకే ఇంట్లో పది కేసులు నమోదయ్యాయి. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి.. ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్‌ ‌జోన్‌గా ప్రకటించారు. ఎవరినీ బయటకు రానీయకుండా కట్టుదిట్టం చేశారు. నిత్యావసర వస్తువులు వారి ఇళ్లకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు.

Leave a Reply