Take a fresh look at your lifestyle.

దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

దేశవ్యాప్తంగా ఒక్కరోజే 6535 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
దేశంలో వరుసగా ఆరోరోజూ ఆరువేలకు పైగా కొరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6535 పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా, 146 మంది మరణించారు. దీంతో దేశంలో కొరోనా కేసుల సంఖ్య 1,45,380కి పెరిగింది. ఇందులో 80,722 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 60490 మంది కోలుకున్నారు. కొరోనాతో దేశంలో ఇప్పటివరకు 4167 మంది బాధితులు మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జాబితాలో భారత్‌ ‌పదోస్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 52667 పాజిటివ్‌ ‌కేసులు రికార్డయ్యాయి. వైరస్‌ ‌ప్రభావంతో 1695 మంది మరణించారు. తమిళనాడులో 17082 కరోనా కేసులు, 118 మంది మరణించారు. గుజరాత్‌లో 14468 పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా, 888 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 14053 కేసులు నమోదుకాగా, 276 మంది చనిపోయారు. రాజస్థాన్‌లో 7300 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యావగా, 167 మంది మరణించారు.

కొరోనాతో ఎయిమ్స్ ఉద్యోగి మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ‌సీనియర్‌ ఉద్యోగి కరోనాతో మృతిచెందారు. ఎయిమ్స్ ఔట్‌డోర్‌ ‌పేషెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌లో శానిటేషన్‌ ‌సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న 58 ఏండ్ల వ్యక్తి ఈ నెల 16న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే నెగెటివ్‌ ‌రావడంతో వైద్యులు అతనికి కౌన్సెలింగ్‌ ‌చేసి పంపించారు. కాగా, మే 19న ఆరోగ్యం క్షీణించడంతో శ్వాస సంబంధిత విభాగంలో చేరారు. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం నుంచి వెంటీలేటర్‌ ‌సహాయంతో చికిత్స అందిస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన మరణించారని అధికారుల తెలిపారు.

లాక్‌డౌన్‌ ‌సడలింపులతో మరింత ప్రమాదం
అమెరికాలో లక్షకు చేరువలో కరోనా మరణాలు
ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న ఉధృతి : ఆరోగ్య సంస్థ
: ‌ప్రపంచ వ్యాప్తంగా కరోనా కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. అయితే, ఇటీవల పలుదేశాలు ఆర్ధికంగా సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని.. మరికొన్నిదేశాలు కరోనా తగ్గుముఖం పడుతుందని లాక్‌డౌన్‌ ‌నిబంధనలు సడలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో నిబంధనలు సడలిస్తే తక్షణమే రెండోసారి ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చే అవకాశం లేకపోలేదని ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్‌ ‌మైక్‌ ‌ర్యాన్‌ ‌వెల్లడించారు. కొన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దక్షిణాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు బయటపడుతున్నాయి. ఇప్పుడు కరోనా తగ్గుతుందని కరోనాను తక్కువ అంచనా వేయడానికి లేదని అన్నారు. అంటు వ్యాదులు దశల వారీగా దాడి చేస్తాయని.. అలా అని.. రెండోసారి దాడి చేయడానికి నెలల సమయం తీసుకుంటుందని కూడా చెప్పలేమని అన్నారు. కరోనా విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పెను ప్రమాదం తప్పదని ఆయన తెలిపారు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా 213 దేశాల్లో కరోనా అడుగుపెట్టింది. లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో కోవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 17 లక్షలకు పైగా కేసులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్‌, ‌రష్యా, స్పెయిన్‌, ‌బ్రిటన్‌ ‌దేశాలు ఉన్నాయి. భారత్‌ ‌పదో స్థానంలో ఉంది. ఇకపోతే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో మృతుల సంఖ్య 99,805కు చేరింది. ఆ తర్వాత బ్రిటన్‌(36,914), ఇటలీ(32,877), స్పెయిన్‌(26,837) ‌దేశాల్లో కరోనా వల్ల ఎక్కువగా మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు 348,221 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య మంగళవారంతో 58,278 కు చేరుకుంది. కోవిడ్‌-19 ‌కారణంగా పాక్‌లో ఇప్పటివరకు 1,202 మంది మృతిచెందినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది. సింధ్‌లో 23,507, పంజాబ్‌-20,654, ‌కైబర్‌-‌ఫక్తున్వా-8,080, బలూచిస్థాన్‌-3,468, ఇస్లామాబాద్‌-1,728, ‌గిల్గిత్‌-‌బల్టిస్థాన్‌-603, ‌పీవోకేలో 211 మంది వైరస్‌ ‌భారిన పడ్డారు. సింధ్‌ ‌ప్రాంతం కరోనా ప్రభావానికి అత్యధికంగా గురైతుంది. గడిచిన 24 గంటల్లో సింధ్‌లో 573 కొత్త కేసులు నమోదయ్యాయి.•

డ్రాక్సీక్లోరోక్వీన్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్స్‌ను నిలిపివేత
ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచ ఆరోగ్య సంస్ధ భారత్‌కు షాక్‌ ఇచ్చింది. తాత్కాలికంగా హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఇవ్వడం వల్ల అనేక ఇతర ఆరోగ్యసమస్యలు వస్తున్నాయని, కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా మారుతున్నట్లు ద ల్యాన్సెట్‌ ‌తన రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ ‌తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ‌వాడడం నిలిపేసినట్లు ఆయన చెప్పారు. హెచ్‌సీక్యూ వినియోగంపై డేటా సేప్టీ మానిటరింగ్‌ ‌బోర్డు సక్షిస్తున్నదని, దీనిలో భాగంగానే ఆ మాత్రలను వాడడంలేదని టెడ్రోస్‌ ‌తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌, ‌క్లోరోక్వీన్‌ ‌లాంటి మందులను కేవలం మలేరియా పేషెంట్లు మాత్రమే వాడాలని టెడ్రోస్‌ ‌తెలిపారు. కరోనా వైరస్‌తో పోరాడుతున్న వారికి హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధం సమర్థవంతంగా పని చేస్తుందని, భారత ఔషధ రంగానికి మంచి భవిష్యత్‌ ఉం‌దని ఊహించిన దేశ ప్రజల విశ్వసాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ దెబ్బతీస్తుంది. యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ‌కోవిడ్‌19 ‌చికిత్స కోసం కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి. వాస్తవానికి ఈ డ్రగ్‌ ‌కరోనా చికిత్స కోసం తయారు చేసింది కాదు. కానీ కోవిడ్‌ ‌స్వల్ప లక్షణాలు ఉన్నవారు మాత్రం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ‌ట్యా•-లబెట్‌ ‌వేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌కూడా ఈ మాత్రలు వేసుకుంటున్నట్లు గత పత్రిక సమావేంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply