Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న కొరోనా కేసులు

24 గంటల్లో కొత్తగా 1933 మందికి పాజిటివ్‌
రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ క్రమంగా తగ్గుతూ వొస్తున్నది. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1933 మందికి పాజిటివ్‌గా నమోదయింది. వైరస్‌ ‌నుంచి 3527 మంది కోలుకోగా, మహామ్మారి కారణంగా 16 మంది మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 165 కేసులు నమోదవగా ఖమ్మం జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 5,93,103 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,394కు చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,64,303 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 25,406 గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply