Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గిన కొరోనా కేసులు

భారత దేశ వ్యాప్తంగా కొరోనా పాజిటీవ్‌ ‌కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 13,823 మందికి కోరోనా నిర్దారణ కాగా.. 162 మంది మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కోటి 05 లక్షల 95వేల 660 పాజిటీవ్‌ ‌కేసులు నమోదుకాగా.. 1 లక్షా 52 వేల 718 మంది మృతి చెందారు.

ప్రస్తుతం దేశంలో 1,97,201 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. చికిత్స నుంచి కోలుకుని 1,02,45,741 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.66 శాతం ఉండగా..మరణాల రేటు 1.44 శాతానికి తగ్గిందని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌లో పేర్కొంది.

Leave a Reply