Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గుతున్న కొరోనా కేసులు

  • గడిచిన 24 గంటల్లో 2,22,315 కేసులు నమోదు
  • మరో 4,454 మంది వైరస్‌తో మృత్యువాత
    కొరోనా నివారనకు ఎన్నారై డాక్టర్ల కృషి

దేశంలో  కొరోనా  మూడు లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,22,315 మంది కొరోనా బారిన పడగా…4,454 మరణాలు సంభవించాయి. మొత్తం ఇప్పటి వరకు 2,67,52,447 మంది కొరోనా బారిన పడగా….3,03,720 మంది మరణించారు. తాజాగా 3,02,544 మంది కోలుకోగా…మొత్తంగా 2,37,28,011 మంది ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 27,20,716 క్రియా శీలక కేసులున్నాయి.

తమిళనాడులో కొరోనా కేసుల నమోదులో ముందంజలో ఉంది. అక్కడ 35,483 కేసులు, మహారాష్ట్ర 26,672, కర్ణాటక 25,979, కేరళ 25,820, ఆంధ్ర 18,767 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండే సుమారు 59.7 శాతం కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇదిలావుంటే ఢిల్లీలో పాజిటివిటీ రేటు కూడా 2.42 శాతానికి తగ్గింది. ఢిల్లీలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆదివారం ప్రకటించారు. కొత్త కేసుల సంఖ్య తగ్గిపోతే ఈ నెల 31 నుంచి దశలవారీగా అన్‌లాక్‌ను ఎత్తివేస్తామని వెల్లడించారు. మూడో దశ రాకుండా అడ్డుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ ప్రజలకు వ్యాక్సిన్‌ ‌వేయాలని తెలిపారు. ఇక పుదుచ్చేరిలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌తమిళిసై ఆదివారం తెలిపారు. హరియాణాలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించారు.

రాజస్థాన్‌లో వచ్చే నెల 8 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. మరోవైపు కొరోనాపై పోరులో భారత్‌కు సహకరించేందుకు అమెరికాలోని భారత సంతతి వైద్యులు, వృత్తి నిపుణులు ముందుకొచ్చారు. కొరోనా రెండో దశ భారత్‌లోని గ్రావి•ణ ప్రాంతాలను వణికిస్తున్న నేపథ్యంలో ’ప్రాజెక్ట్ ‌సహాయం(మదత్‌)’ ‌పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా, భారత్‌లోని వైద్యులు, వృత్తి నిపుణులు కలిసి దీన్ని మొదలుపెట్టారు. గ్రామాల్లోని కొవిడ్‌ ‌రోగులకు చికి త్స అందించే ఆరోగ్య సిబ్బందికి వర్చువల్‌గా సమాచారాన్ని అందిస్తుంటారు. దవాఖాన ల్లో పడకల లభ్యత, వ్యాక్సిన్‌ ‌సమాచారం అందిస్తా రు. స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఆర్‌ఎం‌పీ వైద్యులకు సరైన శిక్షణ అందించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న రాజా కార్తికేయ తెలిపారు.

తద్వారా గ్రామాల్లో వైరస్‌ ‌వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. సహాయం ప్రాజెక్టు బృందం ప్రాథమికంగా తెలంగాణ, ఆంధప్రదేశ్‌లోని గ్రామాల్లో ఆర్‌ఎం‌పీలతో కలిసి పనిచేస్తోందన్నారు. త్వరలోనే ఇతర ప్రాంతాలకూ సేవలను విస్తరించి కొవిడ్‌ ‌రోగులకు అవసరమైన చికిత్స, ఇతర సహాయ సహకారాలు అందించనున్నట్లు కార్తికేయ తెలిపారు. న్యూయార్క్‌లో ఉంటున్న కార్తికేయ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొవిడ్‌పై గ్రావి• ణ ప్రజలు అప్రమత్తంగా లేరన్నారు. ఉదాహరణకు కరీంనగర్‌లో 70-80 కేసులు గ్రావి•ణ ప్రాంతాల నుంచే వస్తున్నట్లు తెలిపారు. గ్రావి•ణ ప్రజల్లో భయాన్ని పారద్రోలి, వారికి మెరుగైన చికిత్స అందేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

స్వల్ప లక్షణాలున్న కొవిడ్‌ ‌రోగులను ఎలా రక్షించాలన్న అంశంపై ఆర్‌ఎం‌పీలకు శిక్షణ ఇవ్వడంపైనే దృష్టి సారించినట్లు వెల్లడించారు. అమెరికాలో గత ఏడాది తమకు ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, వాటిని భారత్‌లోని గ్రామాల్లో వైరస్‌ ‌కట్టడికి అమలు చేస్తామని తెలిపారు. జూమ్‌ ‌ద్వారా వారానికి రెండు రోజులు ఆర్‌ఎం‌పీలతో సమావేశమవుతామన్నారు. రెండు తెలుగు రాష్టాల్లో్ర ఇప్పటికే 150 మందికి పైగా ఆర్‌ఎం‌పీలతో భేటీ అయినట్లు వివరించారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆర్‌ఎం‌పీలు, ఆరోగ్య కార్యకర్తలకు వైద్యపరమైన సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు అందజేస్తారని తెలిపారు.

Leave a Reply