Take a fresh look at your lifestyle.

దేశంలో 58లక్షలు దాటిన కొరోనా కేసులు

న్యూదిల్లీ : భారత్‌లో కోవిడ్‌ ‌కేసుల సంఖ్య శుక్రవారంతో 58 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 1,141 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 58,18,571కి చేరగా, ఇందులో 9,70,116 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి.

47,56,165 మంది పేషెంట్లు పూర్తిగా స్వస్థత చేకూరి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 92,290కి చేరింది. దేశంలో కొరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో 13 లక్షల కేసులు నమోదు కాగా, 6,54.385 కేసులో ఆంధప్రదేశ్‌ ‌రెండో స్థానంలో ఉంది. ఐసీఎంఆర్‌ ‌లెక్కల ప్రకారం సెప్టెంబర్‌ 24 ‌వరకూ దేశంలో 6,89,28,440 కోవిడ్‌ ‌పరీక్షలు జరిగాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply