- తెలంగాణలో కొత్తగా 2,511 మందికి పాజిటివ్
- రేపటి నుండి కోవాగ్జిన్ రెండో దశ ట్రయల్స్..
- భారత్ బమొటెక్కు అనుమతులు
భారత్‌లో కొరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ దశలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షల మార్క్‌ను
కూడా దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం…24 గంటల్లో కొత్తగా 86,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి…1089 మంది కొరోనా బారినపడి మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40,23,179కి చేరుకోగా…ఇప్పటి వరకు కొరోనాతో 69,561 మంది మృతి చెందారు.. ప్రస్తుతం దేశంలో 8,46,395 యాక్టివ్ కేసులు ఉన్నాయని..ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 31,07,223 మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది. మరోవైపు సెప్టెంబర్ 4వ తేదీన దేశ్యాప్తంగా 10,59,346 కొరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని… దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 4,77,38,491కు చేరిందని ఐసీఎంఆర్ తెలిపింది.
మొత్తంగా భారత్‌లో కొరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది…మొన్నటి వరకు 80 వేల లోపు నమోదు అయిన పాజిటివ్ కేసులు ఇప్పుడు ఆ మార్క్‌ను కూడా క్రాస్ చేశాయి. ఇవాళ ఏకంగా 86,432 కొత్త కేసులు నమోదు కావడం..1089 మంది మృతి చెందడం ఆందోళన కలిగించే విషయం. తాజా గణాంకాలతో భారత్‌లో కొరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్‌ను భారత్ సపిస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఐసీఎంఆర్ కూడా తన పరీక్షల నివేదికలను రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు 4,77,38,491 మందికి కరోనా పరీక్షలు చేపట్టినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. శుక్రవారం ఒక్క రోజే 10,59,346 మందికి వైరస్ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ తన బులిటెన్‌లో పేర్కొన్నది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఏపీల్లోనే 70 శాతం కోవిడ్19 మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రికవరీ రేటు 77.15 శాతానికి పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశంగా పరిణమించింది.
తెలంగాణలో కొత్తగా 2,511 పాజిటివ్
తెలంగాణలో కొరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,511 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,38,395 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కొరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 877కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,579 మంది కొరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,04,603గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. మరో 25,729 కేసులు •ంఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది.
రూపటి నుండి కోవాగ్జిన్ రెండో దశ ట్రయల్స్.. భారత్ బమొటెక్కు అనుమతులు
కొరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. వ్యాక్సిన్, మందులు, కొత్త పరికరాలు, కొత్త ఆవిష్కరలు ఇలా రకరకాల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. భారత ఫార్మా రంగంలో హైదరాబాద్ ఫార్మా రంగానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. కొవాక్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్‌కు కీలక అనుమతులు లభించాయి. ఈ వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే తొలిదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించగా..ఆశాజనక ఫలితాలు రావడంతో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా రెండో దశ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. రెండో దశ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన ఈ సంస్థ.. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుంది.