Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కొరోనా కేసుల పెరుగుదల

  • దిల్లీ క్రైమ్‌ ‌బ్రాంచ్‌లో 300 మంది పోలీసులకు కొరోనా
  • జైలులో 46 మంది ఖైదీలకు పాజిటివ్‌
  • ‌తగ్గిన మరణాల సంఖ్య..కొరోనాతో తాజాగా 146 మంది మృతి

న్యూ దిల్లీ, జనవరి 10 : దేశంలో రోజువారీ కొవిడ్‌ ‌కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,79,723 మందికి కోవిడ్‌ ‌సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే మరణాల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే విషయం. కొత్తగా కొరోనా వల్ల ఒక్కరోజు వ్యవధిలో మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో కోవిడ్‌ ‌రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగంగా కొనసాగుతుంది. ఆదివారం ఒక్క రోజే 29,60,975 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,51,94,05,951కు చేరింది. దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య 4,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఒమిక్రాన్‌ అం‌త ప్రమాదకారి కానప్పటికీ.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో… దేశ రాజధాని దిల్లీలో రెడ్‌ అలెర్ట్ ‌జారీ చేశారు.

తాజాగా దిల్లీ క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సహా 300 మంది పోలీసులు కొరోనా బారినపడ్డారు. ఢిల్లీలో 80 వేలకు పైగా పోలీస్‌ ‌సిబ్బంది ఉన్నారు. పోలీస్‌ ‌డిపార్ట్‌మెంట్‌లో కొరోనా కేసులు నమోదు కావడంతో.. ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ‌రాకేష్‌ అస్థానా స్టాండర్డ్ ఆపరేటింగ్‌ ‌ప్రోసీజర్‌ ‌జారీ చేశారు. ఢిల్లీ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం..పోలీసు సిబ్బంది ప్రజల మధ్య తమ విధులను నిర్వర్తించే ఫ్రంట్‌లైన్‌ ‌కార్మికులు కాబట్టి, కోవిడ్‌కు గురికాకుండా తమను తాము రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. అదేవిధంగా పోలీసు సిబ్బంది అందరూ ఫేస్‌ ‌మాస్క్‌లు ధరించి.. సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపింది. పోలీసులు తమతమ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు సరైన పరిశుభ్రతను పాటించాలని సూచించింది.

దిల్లీలోని మూడు జైళ్లలో 46 మంది ఖైదీలు,43 మంది సిబ్బందికి కొరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. కొరోనా సోకిన ఖైదీలు, సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్నారని.. వారు ప్రస్తుతం కోలుకుంటున్నారని సీనియర్‌ అధికారి తెలిపారు. జైలు అధికారుల సమాచారం ప్రకారం..ఆదివారం వరకు 46 మంది ఖైదీలకు కొరోనా సోకింది. తీహార్‌ ‌జైలులో 29 మంది ఖైదీలకు, మండోలి జైలులో ఉన్న 17 మంది ఖైదీలకు కొరోనా సోకింది. కొరోనా సోకిన 43 మంది సిబ్బందిలో 25 మంది తీహార్‌ ‌జైలుకు, 12 మంది రోహిణి జైలుకు, ఆరుగురు మండోలి జైలుకు చెందినవారున్నారు.

Leave a Reply