Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా కేసులు తగ్గుముఖం

తాజాగా 27,254 కొత్త కేసులు నమోదు..219 మృతి
దేశంలో కొరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 27,254 కొరోనా కేసులు నమోదయ్యాయి. కాగా 219 మంది మహమ్మారి కారణంగా మృతి చెందగా..37,687 మంది పాజిటివ్‌ ‌బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,32,64,175కి చేరగా..4,42,874 మృతి చెందారు. కొరోనా చికిత్స నుంచి 3,24,47,032 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం 3,74,269 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 74,38,37,643 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌లో వెల్లడించింది.

Leave a Reply