Take a fresh look at your lifestyle.

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌
‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : ‌దేశవ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అధికంగా రికార్డు సంఖ్యలో పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 19 వేల 893 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం ఈ సంఖ్య 17 వేల 135గా ఉంది. మొత్తం కొరోనా కేసుల సంఖ్య 4,40,87,037కి పెరిగింది. ఇందులో 4,34,24,029 వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో వైరస్‌ ‌నుంచి 53 మంది చనిపోయారు. మరణాల సంఖ్య 5,26,530గా ఉంది. 1,36,478 యాక్టివ్‌ ‌కేసులున్నట్లు వెల్లడించింది. 20 వేల 419 మంది వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు.

రోజువారి పాజిటివిటి రేటు 4.3 శాతానికి చేరిందని వెల్లడించింది. 0.31 శాతం కేసులు యాక్టివ్‌ ‌గా ఉన్నట్లు, రికవరీ రేటు 98.50 శాతంగా ఉందని తెలిపింది. కరోనా వైరస్‌ ‌నుంచి చెక్‌ ‌పెట్టడానికి వ్యాక్సిన్‌ ‌పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 205.22 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ ‌డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 205 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ జరిగింది. పుదుచ్చేరి పోలీసు శిక్షణా కేంద్రంలో 29 మందికి కరోనా పాజిటివ్‌(అనీసనీనిజీ •ఔనీబతిబితిల।) నిర్దారణ అయింది. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 100 మంది పోలీసులకు కరోనా సోకినట్లు సోషల్‌ ‌డియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ‌డా.శ్రీరాములు విడుదల చేసిన ప్రకటనలో, గత నెల 31వ తేదీ ఆరుగురికి పాజిటివ్‌ ‌నిర్దారణ కాగా, బుధవారం ఒకేరోజు 29 మందికి సోకిందని, కేంద్రంలోని అందరికీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply