Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో రోజుకు ఐదు వందలకు చేరువలో కొరోనా కేసులు

బుధవారం వైరస్‌తో నలుగురు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతూ ఐదొందలకు చేరుకుంటున్నాయి. వారం రోజులుగా జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటల వరకు 56,464 కొరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..493 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,791కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ ‌విడుదల చేసింది.
తాజాగా కోవిడ్‌తో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1680కి చేరింది. కొరోనా బారి నుంచి బుధవారం 157 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,427కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,684 ఉండగా.. వీరిలో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొత్తగా 138 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొరోనా పరీక్షల సంఖ్య 98,45,577కి చేరింది.

Leave a Reply