Take a fresh look at your lifestyle.

కరోనా కేసులు 29: మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌

కరోనా వైరస్‌పై గురువారం రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేయకముందే.. కేంద్ర ప్రభుత్వం వైరస్‌ ‌నియంత్రణకు అన్ని ఏర్పాటు చేసిందన్నారు. మార్చి 4 వ తేదీ వరకు దేశంలో 29 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి రోజూ పరిస్థితిని సక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రుల బృందం కూడా ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిపై సక్ష నిర్వహిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్‌ ఇక నుంచి కచ్చితంగా చేపట్టనున్నట్లు తెలిపారు. సుమారు 29 వేల మందిని మానిటర్‌ ‌చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్త రీజనల్‌ ఎర్జెన్సీస్‌ ‌డైరెక్టర్‌ ‌రోడ్రికో ఓఫ్రిన్‌ ‌చెప్పారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవాళ్లేనని అన్నారు. భారత ప్రభుత్వం పూర్తి సన్నద్దంగా ఉందని, భారీ సంఖ్యలో ఐసోలేషన్‌ ‌వార్డులను సిద్ధంగా ఉంచిందని చెప్పారాయన.

అయితే తక్షణంచేయాల్సిందల్లా కరోనా వైరస్‌ ‌వ్యాప్తి ఎక్కువైతే ట్రీట్మెంట్‌ ఇచ్చేందుకు డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవడమేనని అన్నారు రోడ్రిక్‌. అం‌దుకోసం భారీ సంఖ్యలో డాక్టర్లు, నర్సులకు ట్రైనింగ్‌ ఇవ్వాలని అన్నారు. భారత్‌ ‌లో కరోనా వైరస్‌ ‌వ్యాప్తి గురించి మాట్లాడిన రోడ్రికో ప్రజల్లో అవగాహన మరింత పెరగాలన్నారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా జాగ్రత్తపడాలని, ఎవరైనా విదేశాల నుంచి వస్తే.. లక్షణాలేవీ లేకున్నా14 రోజుల పాటు ఇతరులను కలవకుండా ఇంట్లోనే సెల్ఫ్ ‌క్వారంటైన్‌ ‌పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజులో తరచూ చేతులను సబ్బు లేదా ఆల్కహాల్‌ ‌బేస్డ్ ‌హ్యాండ్‌ ‌వాష్‌ ‌తో శుభ్రం చేసుకోవాలని చెప్పారు రోడ్రిక్‌. ‌సాధారణ జలుబు, దగ్గు ఉన్నా తప్పనిసరిగా మాస్క్ ‌పెట్టుకోవాలని, ఏమాత్రం అనుమానం ఉన్నా ఆలస్యం చేయకుండా డాక్టర్‌ ‌ని కలవాలని సూచించారు. ముఖ్యంగా ముసలివాళ్లు, చిన్నపిల్లలకు వైరస్‌ ‌సోకే ముప్పు ఎక్కువని, వారి విషయంలో మరింత శ్రద్ధ అవసరమని చెప్పారు. అయితే ఎండలు పెరిగే కొద్దీ వైరస్‌ ‌ప్రభావం తగ్గుతుందన్న దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి ఎటువంటి శాస్త్రీయ నిర్దారణ కాలేదని రోడ్రిక్‌ అన్నారు.

దుబాయ్‌లో భారతీయ విద్యార్థికి కరోనా:
దుబాయ్‌లోని ఒక భారతీయ విద్యార్థి (16)కి కరోనా వైరస్‌ ‌సోకినట్టు నిర్దారణ అయింది. విదేశాలకు వెళ్ళిన విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అతనికి ఇన్‌ఫెక్షన్‌ ‌సోకిందని గల్ఫ్ ‌న్యూస్‌ ‌గురువారం దుబాయ్‌ ‌హెల్త్ అథారిటీ (డిహెచ్‌ఎ) ‌ను ఉటంకిస్తూ పేర్కొంది. దీంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మొత్తం కరోనా బాధిత కేసుల సంఖ్య 27 కి చేరిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. విదేశాలకు వెళ్లిన దుబాయ్‌కు తిరిగి వచ్చిన ఐదు రోజుల తరువాత బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కరోనా వైరస్‌ ‌లక్షణాలతో బాధడ్డారు. దీంతో మొత్తం కుటుంబాన్ని క్వారంటైన్‌ ‌చేసిన ఆరోగ్య అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో విద్యార్థికి పాజిటివ్‌ ‌రాగా, మిగిలి కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా గురువారం నుంచి స్కూలు మూసివేస్తున్నట్టు ఇండియన్‌ ‌హై గ్రూప్‌ ఆఫ్‌ ‌స్కూ ప్రకటించింది. పాఠశాల విద్యార్థులు, సిబ్బందికి డిహెచ్‌ఎ అధికారులు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply