Take a fresh look at your lifestyle.

ఉలిక్కిపడ్డ నిజామాబాద్…! కొరోనా కేసు నమోదు

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారి ఉలిక్కిపడింది. లాక్ డౌన్ జరుగుతున్న తరుణంలో ఏ ఒక్కరికి కారణాలు లక్షణాలు లేకపోవడంతో అధికారులందరూ సాదాసీదాగా విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఓ రిటైర్డ్ ఉద్యోగి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జనతా కర్ఫ్యూ జరిగి ఎనిమిది రోజులు గడిచి, లాక్ డౌన్లోడ్ మొదలై ఏడు రోజులు గడుస్తున్నది. పాజిటివ్ వచ్చిన వారందరినీ క్యారం టైన్ లో ఉంచారు. వారిలో 30 మందికి లక్షణాలు ఉన్నాయని పరీక్షలు జరిపిన అక్కడ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. అది ధీమాతో ఉన్న వారికి ఇటువంటి విదేశాలకు వెళ్లకుండానే ఒక మతపరమైన ఈ సమావేశానికి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ అని నిర్ధారణ రిపోర్ట్ రావడంతో కలకలం మొదలయ్యింది. విదేశాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన వారికి పాజిటివ్ లక్షణాలు లేకపోవడం, స్థానికంగా ఇంటి వద్దనే ఉండే రిటైర్డ్ ఉద్యోగి 25 మంది స్థానికులతో కలిసి వెళ్లి రావడం అతనికి ఒక్కడి లోనే కారణాలు లక్షణాలు రావడం. అధికార యంత్రాంగాన్ని తట్టి లేపింది. ఇప్పటివరకు అప్రమత్తతో ఉన్న అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. లాక్ డౌన్ ఉదయం 6 గంటలనుండి రాత్రి 7 గంటల వరకు సాదాసీదా తనిఖీలతో సరిపెట్టిన పోలీసు యంత్రాంగం ఆదివారం నుండి ఇ పట్టు బిగించింది. కారణం లేకుండా పిల్ల నుంచి వచ్చే వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది.

- Advertisement -

కుటుంబంతో పాటు కాలనీలో అందరికీ పరీక్షలు…
ఈనెల 12 నుంచి 15 వరకు ఢిల్లీలో మతపరమైన ఈ సమావేశానికి హాజరైన నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పాజిటివ్ అని తెలియడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్య , ఆరోగ్యశాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలను సమన్వయపరుస్తూ రంగంలోకి దిగింది అధికార యంత్రాంగం. రిటైర్డ్ ఉద్యోగి తో పాటు ఏడుగురిని నర్సింగ్ కళాశాల ఉన్న ఐశోలేషన్ సెంటర్ కు తరలించారు. రిటైర్డ్ ఉద్యోగి ఈ నెల 15న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి జలుబు, జ్వరంతో బాధపడి 19న ఆస్పత్రిలో చేరాడు. అప్పటివరకు అతను, అతని కుటుంబ సభ్యులు ఎవరిని కలిశారు.. ఆసుపత్రికి వెళ్ళింది.. ప్రార్థన మందిరా లకు వెళ్ళినప్పటి నుంచి మొత్తం ఆరా తీశారు. కాలనీ మొత్తం క్యారం టైన్ మాదిరిగా ఆధీనంలోకి తీసుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగితో సన్నిహితంగా ఉన్న వారికి హోమ్ క్యారం టైన్ లో ఉంచాలని అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు రిటైర్డ్ ఉద్యోగి ఇంటి ప్రక్కన ఉన్న వారిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఆదివారం తెల్లారేసరికి పారిశుద్ధ్య సిబ్బంది తో, అగ్నిమాపక సిబ్బంది తో రసాయనాలను పిచికారి చేయించారు. ఆదివారం ఉదయం వైద్య శాఖ ఆధ్వర్యంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ నేపథ్యంలో కిల్లా రోడ్డు ఆనుకొని ఉన్న కాలనీ కావడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.

Leave a Reply